ప్రపంచానికి ముప్పును తలపెట్టిందే కాకుండా తలబిరుసుగా ప్రవర్తిస్తున్న చైనాకు భారత ప్రభుత్వం దెబ్బమీద దెబ్బ వేస్తుంది.. ఇప్పటికే మన ప్రధాని మోడీ, చైనా ప్రభుత్వానికి హెచ్చరికలు గట్టిగానే చేశారు.. అంతే కాకుండా లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించిన ప్రధాని మోడీ, ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుంది. మీ ధైర్యసాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు, లడఖ్ నుండి గాల్వన్ వరకు మీరు ప్రదర్శించిన శక్తిని ప్రపంచమంతా చూసింది అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు..

 

 

ఇదిలా ఉండగా చైనా విషయంలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ షాకింగ్ న్యూస్ చెప్పారు అదేమంటే ప్రస్తుతం సరిహద్దుల్లో చెలరేగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్‌ విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకోబోదని స్పష్టం చేశారు. అంతే కాకుండా చైనా, పాకిస్తాన్‌ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని, తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని పేర్కొన్నారు..

 

 

ఇకపోతే శుక్రవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో పలు రాష్ట్రాల విద్యుత్‌ శాఖల మంత్రులతో  ఆయన ఈ విషయాలు తెలిపారు. ఇక ప్రతి వస్తువును మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నాము అయినా గానీ విదేశాల నుండి రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్‌ పరికరాలను భారత్‌ దిగుమతి చేసుకుంది. కాగా ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.. ఇది ఇంతకు ముందు లెక్క, కానీ ఇప్పటి నుండి మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదని ఘాటుగానే హెచ్చరించారు..

 

 

ఇక గ్యాల్వన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో భారత సైన్యంలో 20 మంది మృతి చెందినప్పటి నుండి భారత్ చైనా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది.. ఇక చైనా భారత్‌ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బతీయడానికి మన పక్క దేశాలతో కుట్రలు చేస్తుంది.. ఈ క్రమంలో భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చైనాకు చెమటలు పట్టిస్తుంది.. ఇందులో భాగంగా ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: