ప్రపంచంలో చైనా లోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కోవిడ్ 19... ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,08,03,599 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,18,968కి చేరింది.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 43,45,614 మంది చికిత్స పొందుతు న్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 64,57,985.   అమెరికాలో కరోనా ఉద్ధృతికి ఏ మాత్రం అడ్డుకట్టపడట్లేదు.  భారత్ లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,25,544కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,213కి పెరిగింది. 2,27,439 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,79,892 మంది కోలుకున్నారు

 

కరోనా వైరస్‌లో జన్యుక్రమంలో మార్పు చోటుచేసుకుందని, దీంతో వైరస్‌లో ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్ధ్యం పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు. కొవిడ్‌ చెందిన కోవ్‌-2 వైరస్‌లో ‘డీ614జీ’ అనే రకం వచ్చి చేరిందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్తరకం వైరస్ ప్రవేశిస్తే పరిస్థితి మొత్తం తారుమారు అవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బెటో కోర్బర్ పేర్కొన్నారు.

 

ఈ వైరస్‌లో మార్పు చిన్నదే అయినా అది చాలా సమర్థవంతమైనదని, వైరస్ పై పొరల్లో ఉండే  కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో ఈ మార్పు జరిగినట్టు వివరించారు. ప్రపంచంలో వైరస్‌ అధికంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ‘డీ614జీ’ చేరడంతో పరిస్థితి తారుమారు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త వైరస్సే ఇ‌న్ఫెక్షన్‌ కలింగిచే స్థాయిని పెంచుతుందని శాస్త్రవేత్త బెటె కోర్బర్‌ చెప్పారు.  అంతే కాదు ఈ వైరస్‌ తన ఆకృతి సాయంతో మానవ కణాల్లోకి అధికంగా ప్రవేశిస్తుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: