దేశంలో కరోనా కేసులు అంతకంతగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశంలో 20,903 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 379 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోకూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ మద్య తెలంగాణలో మూడు రోజుల పాటు కరోనా పరీక్షలు ఆపిన విషయం తెలిసిందే. శాంపిల్స్ ఎక్కువ కావడం.. కొత్త శాంపిల్స్ కి తీసుంటే మరింత భారం అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా పరీక్షలకు నమూనాల సేకరణను ఆరోగ్యశాఖ తగ్గించింది.

 

రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షలకు పైగా శాంపిళ్లు పెండింగ్‌లో ఉండటంతో వాటికి పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే కొత్తవి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు అన్ని జిల్లాల్లో నమూనాల సేకరణ 20 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో బస్సుల ద్వారా శాంపిళ్ల సేకరణ నిలిపివేశారు. కొన్ని ఆస్పత్రుల్లో అత్యవసర రోగుల నుంచి మాత్రమే రోజుకు 50వరకూ నమూనాలు సేకరిస్తున్నారు.  ప్రస్తుతం చాలా జిల్లాల్లో కరోనా లక్షణాలున్నా, లేకున్నా స్వాబ్‌ తీసుకుంటున్నారు.

 

దీనివల్ల కూడా శాంపిల్స్‌ పెరిగిపోతున్నాయి.  మరోవైపు ఎలాంటి లక్షణాలు లేనివారే ఎక్కువగా పరీక్షలు చేయించుకోవడం మరో సమస్యగా మారినట్లు సమాచారం. ఇలా అందరి నుంచి నమూనాలు సేకరించడం వల్ల నిజంగా వైరస్‌ సోకినవారిని గుర్తించడం ఆలస్యమవుతోంది. కాబట్టి సోమవారం నుంచి కేవలం కరోనా లక్షణాలున్న వారికి మాత్రమే టెస్ట్‌ చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: