ఆ మద్య దేశంలోకరోనా వైరస్ పెరిగిపోతుందని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడా కొన్ని అత్యాచారాల, లైంగిక కేసులు నమోదు అయ్యాయి. కానీ లాక్ డౌన్ సడలించిన తర్వాత మళ్లీ కథ మొదలుకొచ్చింది.  అత్యాచారాలు, లైంగిక, హత్యల పరంపర కొనసాగుతుంది. తాజాగా  కరోనా వైరస్‌ కు మందులను ఆసుపత్రి నుంచి ఇప్పిస్తామని చెప్పి బాలికను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు ఆమెపై సామూహిక లైంగిక‌దాడి జరిపిన దారుణ ఘటన చత్తీస్‌ఘడ్ లోని ఓ గ్రామంలో జరిగింది.  ఓ మైనర్ బాలికకు కరోనా వచ్చిందని చెప్పి దానికి దగ్గరలో మందులు ఇస్తున్నారని నమ్మబలికారు ఇద్దరు బాలురు.

 

దాంతో నమ్మి వారి వెంట వెళ్లింది ఆ బాలిక. ఆ బాలికను నిర్జీవ ప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచారం జరిపారని ఏఎస్పీ ప్రతిభాపాండే చెప్పారు.  తమ గ్రామంలో కరోనాకు మంచి మందు వచ్చిందని నమ్మించి ఇంటి దగ్గర నుంచి ఇద్దరు బాలురు తన అక్కను కరోనా నివారణకు మందులు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి తీసుకువెళ్లారని బాలిక తమ్ముడు తల్లిదండ్రులకు చెప్పాడు.

 

తనను బయటకు తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు తనపై లైంగిక‌దాడి చేశారని బాలిక తల్లిదండ్రులకు చెప్పిందని, దీంతో వారు ఫిర్యాదు చేశారని ఏఎస్పీ పేర్కొన్నారు.  బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ చెప్పారు. నిందితుల్లో ఓ బాలుడ్ని అరెస్టు చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ ప్రతిభా పాండే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: