భారత్-చైనా సరిహద్దు లో పరిస్థితి రోజు రోజుకు మరింత తీవ్రం గా మారిపోతున్న విషయం తెలిసిందే.. రెండు దేశాలు భారీ మొత్తంలో సరిహద్దుల్లో సైన్యం మోహరించడం ఆయుధాలను రప్పించడం చూస్తూ ఉంటే త్వరలో యుద్ధం జరగడం ఖాయమనే సంకేతాలు ఇస్తోంది. ఇక సరిహద్దులో చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత్ చైనాను  దృఢంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైపోయింది. ఇటీవలే గాల్వాన్ లోయలో  పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ విస్తరణ వాదాన్ని  ఇకనైనా మానుకో చైనా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. 

 

 అయితే ఒకవేళ చైనాకు భారత్ కి యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు ఎటువైపు నిలుస్తాయి అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రోజురోజుకి భారతదేశానికి మద్దతు ప్రకటిస్తున్న దేశాల సంఖ్య ఎక్కువ అయిపోతుంది. చైనా విస్తరణ వాదం  తీరు అర్థం చేసుకున్న ప్రపంచ దేశాలు చైనా దుందుడుకు చర్య పై కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం చేయాల్సి వస్తే తాము భారత్ వైపు నిలబడతాను అని ఇప్పటికే పలు దేశాలు స్పష్టం చేశాయి. 

 


 ఇక తాజాగా మరో దేశం కూడా భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ దేశాలు భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జపాన్ కూడా భారత్ కు మద్దతు ప్రకటిస్తున్న దేశాల జాబితాలో చేరింది. ఏకపక్షంగా సరిహద్దులను మార్చే ఎలాంటి ప్రయత్నాలనైనా తాము వ్యతిరేకిస్తామని అంటూ జపాన్ స్పష్టం చేసింది. చర్చల ద్వారా సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుందని తాము ఆశిస్తున్నట్లు గా జపాన్ రాయబారి సంతోషి సుజుకి భారత విదేశాంగ ప్రతినిధి హర్షవర్ధన్ తో భేటీ అనంతరం వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: