మంచి చేసినా, చెడు చేసినా, అసలు ఏం చేసినా, ఎప్పుడూ విమర్శించడమే తప్ప, ఎప్పుడూ అభినందించిన వారు ఆకస్మాత్తుగా అభినందిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది.. మొదటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ వైసీపీ విషయంలో ఎప్పుడూ నెగిటివ్ గా ఉంటూ వస్తున్నారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఆ పార్టీని విమర్శించడమే పనిగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైసిపి ఏం చేసినా, దానిలోని లోపాలను వెతికి పట్టుకొని విమర్శించడం వంటివి జనసేన మొదటి నుంచి చేస్తూ వస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏపీ ప్రభుత్వం సుమారు వెయ్యికి పైగా అంబులెన్సులను ప్రవేశపెట్టడాన్ని పవన్ ప్రశంసించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పవన్ అభినందించారు. 
 
IHG

అలాగే కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలోనూ, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న తీరు అభినందనీయం అంటూ పవన్ ప్రశంసించే సరికి వైసీపీ లో ఎక్కడలేని ఆనందం కనిపిస్తుంది. 1088 నూతన 108 ,104 వాహనాలను ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా జగన్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. జాతీయ మీడియాలో ఈ విషయం హైలెట్ అయ్యింది. పార్టీలకతీతంగా జగన్ తీరు జాతీయస్థాయిలో అందరూ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో జగన్ కు ఈ స్థాయిలో పొగడ్తలు వస్తున్న సందర్భంగా, సొంత రాష్ట్రంలో ఆయనను ప్రశంసించకపోతే ప్రజల్లోనూ, తమపై చులకన భావం ఏర్పడుతుంది అనుకున్నారో, ఏమో కానీ, మొదటిసారిగా జగన్ తీరును ప్రశంసించారు.
 


 ఇది ఇలా ఉంటే పవన్ ట్వీట్లు  చేయడం తో ఆనందంలో ఉన్న వైసీపీ శ్రేణులు పవన్ ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్ లను తీసి తమ ఫేస్బుక్, వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేస్తూ, పవన్ ప్రశంసిస్తూ పోస్ట్ పెడుతున్నారు. చూశారా తమ నాయకుడిని పవన్ కూడా పొగిడేశారు. మొన్న చిరంజీవి, నిన్న నాగబాబు, ఇప్పుడు పవన్ మొత్తానికి తమ నాయకుడి గొప్పతనం ఒప్పేసుకున్నారు అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపైన జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. పవన్ ను వైసీపీ ఇలా వాడుకోవడంతో వారిని అభినందించాలో, విమర్శించాలో తెలియక సతమతమైపోతున్నారు.ఏది ఏమైనా వైసీపీ శ్రేణులు పవన్ టిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాయి. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: