ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వున్నగ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఇల్లును శనివారం అధికారులు కూల్చివేసారు. నిన్న ఎనిమిది మంది పోలీసుల మరణానికి కారణమయ్యాడు వికాస్ దూబే. గత కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబే ను పట్టుకోవడానికి గురువారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అతను వున్ననివాసానికి(ఇప్పుడు కూల్చివేసింది) చేరుకున్నారు అయితే అప్పటికే అక్కడ మాటువేసి వున్న వికాస్ దూబే అనుచరులు,పోలీసులపై కాల్పులు జరపడంతో 8మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్కౌంటర్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం తోపాటుపెన్షన్ ,ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు వికాస్ దూబే ఆచూకీ చెప్పినవారికి 50000 రివార్డ్ ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. పోలీసు బృందాలు అతనికి కోసం గాలిస్తున్నాయి. ఇదిలావుంటే పోలీసులను చంపిన వికాస్ దూబేను పోలీసులే హతమార్చాలని వికాస్ దూబే తల్లి సరళా దేవి వ్యాఖ్యానించింది. వికాస్ దూబేను అరెస్టు చేశాక ఎన్కౌంటర్ చేయాలని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: