తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ మహమ్మారి  శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  విషయం తెలిసిందే. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరి లో కరోనా  వైరస్ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలోని ఎక్కువ కేసులు నమోదు అవుతున్న  నేపథ్యంలో నగర వాసులు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే కరోనా  వైరస్ సంక్షోభం సమయంలో ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిస్థితి ఎంతో దయనీయంగా మారింది అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట. ఎందుకంటే ఎప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనంతో... భారీ షాపింగ్ మాల్స్ తో.. కస్టమర్ తో కిటకిటలాడే హోటల్స్ తో  హైదరాబాద్ నగరం మొత్తం నిండుగా కనిపించే. 

 

 కాని ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాళీ షాపింగ్ మాల్స్.. ఎక్కడ చూసినా టూలేట్ బోర్డు లే ఎక్కువగా కనిపిస్తున్నాయి, రోడ్లన్నీ దాదాపుగా ఖాళీ అయిపోయాయి... దీంతో అన్ని వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్  సంక్షోభం కారణంగా చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల  వరకూ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకు పోయారు అన్నది అందరికీ తెలిసిన మాట. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  సంక్షోభంలో ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. 

 

 ఈ నేపథ్యంలో కస్టమర్స్ ఎవరూ లేక హోటల్ యాజమాన్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. ఇక ఇళ్లల్లో ఎవరు కూడా అద్దెకు ఉండకపోవడంతో అద్దె  సంపాదనపై  బతుకుతున్న వారికి నష్టాలు దరి చేరుతున్నాయి. అదే సమయంలో ఒకప్పుడు ఆటో క్యాబ్ వాళ్ళకి భారీగా డిమాండ్ ఉండేది కానీ ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో  ఎక్కువ మంది ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి క్యాబ్ ఆటోల్లో  ఎక్కడికి వెళ్లడం కూడా మానేశారు జనాలు. అయితే ఇలా వ్యాపారాలు నష్టాల్లో  కూరుకుపోవడం అటు తెలంగాణ రాష్ట్రానికి కూడా పెద్ద ఆర్థిక లోటు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిస్థితి ఎంత దయనీయంగా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: