ఇపుడు ఈ మంత్రమే ఏపీ  వైసీపీ రాజకీయాలకు పరమ పవిత్రం. ఎందుకంటే దాని మీదనే ఏపీ రాజకీయం నిలువుగా సాగుతుందా అడ్డం తిరుగుతుందా అన్నది ఆధారపడి ఉంది. ఇంతకీ ఓం బిర్లా అంటే ఎవరో కాదు మన లోక్ సభ స్పీకర్. ఆయన చేతిలో ఒక ఎంపీ గారి భవితవ్యం, అలాగే ఒక పార్టీ పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి.

 

ఆయన ముఖం ఇక చూడకూడదు, ఆయన ఎంపీ సీట్లో ఉండకూడదు, ఉప ఎన్నికలు వచ్చినా సరే రెడీ అంటున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్. ఆయన తరఫున వైసీపీ  ఎంపీలు వెళ్ళి ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలసి నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని కంప్లైంట్  చేసి వచ్చారు. ఏ క్షణంలోనైనా వేటు ఖాయం. రాజు గారి ఆట కట్టు అంటున్నారు వైసీపీ నేతలు.

 

ఇక మరో వైపు చూస్తే తన మీద అనర్హత వేటు పడేంత తప్పు తానేం చేశానని రాజు గారు అంటున్నారు. తాను ఎంపీగానే ఉంటాను అంటున్నారు పైగా తన పార్టీ వైసీపీ అని కూడా చెబుతున్నారు. ఇక వైసీపీలో క్రమ శిక్షణా సంఘమే లేదు. తనకు ఎలా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారని రాజుగారు లాజిక్ పాయింట్ లాగుతున్నారు. ఇక నర్సాపురంలో ఉప ఎన్నిక అంటే అది వట్టి జోక్ అంటున్నారు. ఎన్నికలు వచ్చేంత సీన్ ఇక్కడేమీ లేదని లైట్ తీసుకుంటున్నారు.

 

సరిగ్గా ఇదే వైసీపీ నేతలకు మండుకువచ్చేలా చేస్తోంది. సరే దీని మీద విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తాము చెప్పినదంతా సావధానంగా లోక్ సభ స్పీకర్ విన్నారని, అన్ని ఆధారాలు సమర్పించామని కూడా చెబుతున్నారు. రాజు గారు విపక్షంతో చేతులు కలిపారు కాబట్టి ఆయన మీద వేటు వేయమని కూడా కోరుతున్నామని అంటున్నారు. దీని మీద కూడా రాజు గారు గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఏదీ మాట్లాడలేదని, స్పీకర్ కి ఇచ్చిన కంప్లైంట్ లో ఏమీ లేదని, తనని సస్పెండ్ చేసేంత సీన్ అందులో లేదని కూడా అంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే స్పీకర్ విచక్షణ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీకర్ తలచుకుంటే అర నిముషంలో ఎంపీగా రాజు గారిని డిస్ క్వాలిఫైడ్ చేసి పారేస్తారు. దానికి ఆధారాలు ఉన్నాయా లేవా అన్న దాని మీద ఎవరూ ఎలా కూడా  జోక్యం చేసుకోలేరు.  ఇక ఆయన కనుక రాజు గారికి ఫేవర్ చేయాలనుకుంటే మాత్రం కధను అలా  నానుస్తూ పోతారు. అందువల్ల ఇపుడు కీలక భూమిక మాత్రం ఓం బిర్లాదే. అందువల్ల ఆయన జపం ఇపుడు వైసీపీలోనూ, అలాగే  ఏపీ రాజకీయాల్లోనూ సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: