పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇపుడిపుడే బాగా ముదురుతున్నాడు. అందుకే ఆయన చంద్రబాబు  చీటికి మాటికీ వైసీపీ మీద  కామెంట్స్ చేయడం లేదు. ఇంకా నాలుగేళ్ల సమయం కూడా ఉంది. జగన్ సర్కార్ ఈ లోగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. సరిగ్గా వైసీపీ సర్కార్  తప్పుకు దొరికిన నాడు నిగ్గదీసి నిలదీసి కడిగేసే చాన్స్ కోసమే పవన్ ఎదురుచూస్తున్నాడు.

 

అయితే పవన్ మీద ఒక పెద్ద విమర్శ ఉంది. ఆయనకు జగన్ అంటే అసూయ అని.జగన్ అంటే పడదని, జగన్ మంచి చేసినా మెచ్చుకోడని, ఇది జనంలోకి బాగా ఎక్కువగా  తీసుకెళ్ళడంలో వైసీపీ సక్సెస్ అయింది. అందుకే పవన్ ఇపుడు గేర్ మార్చాడు, రూట్ కూడా మార్చాడు. దాని ఫలితమే ఇపుడు కొంత తగ్గుతున్నాడు.ఇదివరకు మాదిరిగా జగన్ మీద గట్టిగా నోరు చేసుకోవడంలేదు.

 

ఇదిలా ఉండగా ఇపుడు జగన్ తీసుకొచ్చిన 1088 కొత్త అంబులెన్సులను పవన్ ఒక్క లెక్కన పొగిడేశారు. అవి ఈ టైంలో జనాలకు ఎంతో ఉపయోగపడతాయని కూడా అభినందించారు. అదే విధంగా కరోనా టెస్టుల విషయంలో ఏపీ సర్కార్ నిబధ్ధత‌తో పనిచేస్తోందని కూడా కితాబు ఇచ్చారు. నిజానికి ఈ రెండూ కూడా వాస్తవాలే.  జనంలో అనుకుంటున్నవే. దానికి పవన్ మార్క్ పొలిటికల్ టచ్ ఇచ్చి మెచ్చుకున్నాడు. అంత మాత్రం చేత అవుట్రేట్ గా వైసీపీని పవన్ మెచ్చుకున్నట్లు కాదు.

 

పవన్ చాల స్ట్రాటజీగా వైసీపీని అభినందించారు. ఎవరైతే పొగుడుతారో, వారికే తిట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దాన్ని జనం కూడా తప్పుపట్టరు. ఇప్పటిదాకా పవన్ మీద ఒక అభియోగం ఉంది. జగన్ని తిట్టడమే తప్ప మెచ్చరు అని.దాన్ని పవన్ మెల్లగా తుడిచేసుకుంటున్నారు. ఇక మీదట పవన్ మరింత జాగ్రత్తగా వైసీపీని గమనిస్తారు. తప్పు దొరికిందా ఇంతకు ఇంతలా రెచ్చి ఘాటు విమర్శలు చేస్తారు. మరి దానికి కూడా సిధ్ధపడి విమర్శలని లైట్ గా వైసీపీ నేతలు తీసుకోగలిగితే పవన్ కితాబులను కూడా మతాబులనుకుని  వెలిగిపోవ‌చ్చు. 

 

పవన్ వ్యూహం తెలుసుకోకుండా మా పవన్ మా మంచి పవన్ అని  వైసీపీ నేతలు ఒకటికి పదిసార్లు మురిసితే రేపటి రోజున పవన్ చేసే హాట్ హాట్ విమర్శలు కూడా భరించాలి. అందువల్ల అధికారంలో ఉన్న వారు పూలూ ముళ్ళూ రెండూ సరిసమానంగా తీసుకున్నపుడే రాణించగలరు. పవన్ కూడా ఇపుడు పరిణతి చెందిన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ఎటూ జగన్ని తిడుతూ విశ్వాసాన్ని తగ్గించుకుంటున్న వేళ నిజమైన విపక్ష నేతగా పవన్ అవతరించబోతున్నారు. సో బీ కేర్ ఫుల్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: