ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం గా చైనా దేశం  వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారిపోయి న విషయం. ముఖ్యంగా చైనా సామ్రాజ్యవాద ధోరణి తో విస్తరణ వాద తీరు తో ముందుకు సాగుతుంది అన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాలు గ్రహించాయి. అయితే ప్రస్తుతం భారత వివాదాని కి తెరలేపి  యుద్ధానికి కాలుదువ్వుతుంది చైనా. అయితే భారత్ ఎన్నో ఏళ్ల నుంచి యుద్ధం ఆయుధాల తో ఉంది కానీ చైనా మాత్రం ఎప్పుడైతే విదేశీ కంపెనీల ను ఆహ్వానించి చైనా ప్రపంచీకరణ లోకి అడుగుపెట్టిం దో  ఆ తర్వాత రష్యా నుంచి ఆయుధాలను తప్పించుకుని ఆయుధ సమీకరణ చేసింది. 

 

 వాస్తవంగా అయితే చైనా దొంగచాటుగా  దాడి కాకుండా అధికారిక దాడి చేసి ఉంటే భారత సైన్యం దాడికి అసలు తట్టుకునేది  కాదు అన్నది ఎంతో మంది చెప్పిన మాట. దొంగచాటుగా దెబ్బతీసింది  కాబట్టి చైనా సైన్యం  బ్రతికి బయటపడ గలిగింది  అన్న వాదన కూడా వినిపించింది . అయితే ఒకప్పుడు కమ్యూనిస్టు లు సంస్కరణల విధానంలోకి  అడుగు పెట్టి.. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ సాధ్యమయ్యేందుకు కృషి చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది చైనా. 

 


అయితే ఒకప్పటి సంస్కరణ ల విధానమే ఉండుంటే బాగుండేది కానీ ప్రస్తుతం చైనా మాత్రం సంస్కరణ విధానాలను పక్కన పెట్టి  విస్తరణ వాదంతో ముందుకు సాగుతోంది. పాత పద్ధతిలో అంటే ఏకంగా రాజుల కాలం లో ఎలాగై తే సామ్రాజ్య విస్తరణ చేయాల ని రాజులు  భావించేవా రో  ప్రస్తుతం చైనా  కూడా అదే తరహా భావనతో ముందుకు సాగుతుంది అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలకు అర్థమైంది. అయితే కేవలం విమర్శ వరకు మాత్రమే చేయకుండా ఏకంగా తమ భూభాగాలని చెప్పుకుంటున్న ప్రాంతాలలో అల్లకల్లోలం సృష్టిస్తుంది చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: