కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కరోనా విషయంలో తెలంగాణను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. కేంద్రం రెండు బృందాలను రాష్ట్రానికి పంపి కరోనా అరికట్టడానికి పలు సూచనలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని పెడచెవిన పెట్టి పరిస్థితిని భయానకంగా మార్చింది. కరోనాతో హైదరాబాద్ ఎప్పుడు పేలుతుందో తెలియదు అని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా మన జాగ్రత్తలో  మనం ఉండాలని పిలుపునిచ్చారు. 
 
అన్ని రాష్ట్రాలలాగే తెలంగాణకు కేంద్రం సహాయం చేసింది అందులో భాగంగా 2.5 లక్షల పీపీఈ కిట్స్ ,6.5 లక్షల మాస్క్ లు 22లక్షల ట్యాబ్లేట్స్ తెలంగాణకు ఇచ్చామని అయితే  రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది.  ప్రజలు బయపడుతున్నారు వారికి విశ్వాసం కలిపించాల్సిన బాధ్యత రాష్ట్రనీదే. టెస్టుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మండిపడ్డారు. కొద్దీ సేపటి క్రితం  జన సంవాద్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసగించిన ఆయన ఈవ్యాఖ్యలు చేశారు. 
 
ఇక కరోనా ను హ్యాండిల్ చేస్తున్న తీరు పట్ల తెలంగాణ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకొచ్చింది. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి కానీ సోషల్ మీడియా అనవసరమైన భయాన్ని సృష్టిస్తుంది. కరోనా కేసుల విషయంలో మేము ఏమి దాచడం లేదు ఇంకా చెప్పాలంటే అమెరికా అలాగే ఇంకొన్ని దేశాల కంటే తెలంగాణ,కరోనా ను బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ వైరస్ ను ప్రభుత్వం సృష్టించలేదు ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలని ప్రజా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: