ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో కీలక మలుపులు తిరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి  ఎంపీ అయిన తనను పట్టించు కోవడం లేదని ఆరోపిస్తూ మొదటి నుంచి జగన్ తీరుకు  వ్యతిరేకంగానే ఉన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. రఘురామ కృష్ణంరాజు అంశం ఈ మధ్య కాలం లో మరింత ముదిరింది అని చెప్పాలి. ఏకంగా వైసిపి పార్టీ నుంచి రఘురామ కృష్ణంరాజు కు  షోకాజ్ నోటీసులు జారీ చేయడం కూడా జరిగిపోయింది. 

 

 ఆ తర్వాత వైసీపీ ఎంపీలు అందరు లోక్సభ స్పీకర్ తో  సమావేశ మై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై  అనర్హత వేటు వేయాలని... వెంటనే మరోసారి ఎన్నికల కు వెళతామని వైసిపి చెబుతోంది. ఈ నేపథ్యం లో ఈ అంశం లో కి ఏకంగా కుల ప్రస్తావన కూడా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్షత్రియ సంఘాలు నర్సాపురం లో సమావేశమై రఘురామ కృష్ణంరాజుకు  మద్దతు ఇస్తున్నాయి అంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో టాక్  వినిపిస్తోంది. తాజాగా ఏకంగా రఘురామ కృష్ణంరాజు స్వయంగా కుల ప్రస్తావన  వాడారు. 

 

అల్లూరి సీతారామరాజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడే కాదు... గిరిజనులు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి బ్రిటిష్ వాళ్లందరి నీ గడగడలాడించి  గిరిజనుల సత్తా చూపించిన అటువంటి మహోన్నత వ్యక్తి. జగన్  పాదయాత్ర చేస్తున్న సమయం లో ఓ జిల్లా కి అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం అని హామీ ఇచ్చారని.. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అంటూ రఘురామ కృష్ణంరాజు ఓ సరికొత్త వాదనను తెరమీద కు తెచ్చారు.అయితే ఇది గుర్తు చేయడం మంచిదే అయినప్పటి కీ..ఈ మాట తో  పార్టీ పైన ఇంకా తన ధిక్కార ధోరణి కొనసాగుతుందని రఘురామకృష్ణంరాజు మరోసారి గుర్తు చేశారు అని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: