ఏపీ రాజకీయాల్లో యువ సంచలనం...బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నాయకుడు. జగన్ అభిమానిగా వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన బైరెడ్డి అంటే యూత్‌లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. కేవలం యువకుల్లోనే కాకుండా, యువ మహిళల్లో కూడా బైరెడ్డికి సూపర్ క్రేజ్ ఉంది. బైరెడ్డి అంటే పిచ్చిగా అభిమానించే వాళ్ళు చాలానే ఉన్నారు.

 

అయితే ఇలా ఊహించని అభిమానాన్ని తెచ్చుకున్న సిద్ధార్థ్...ప్రస్తుతం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. పేరుకి ఇన్‌చార్జ్‌ గానీ...ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనులే చేస్తారు. నియోజకవర్గంలో పెత్తనం ఈయనదే. వైసీపీ పెద్దల సపోర్ట్ ఉంది. ఈయన చెప్పినట్లు అధికారులు వింటారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈయన చెప్పిన వారికే సీట్లు వచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే నందికొట్కూరు అనధికార ఎమ్మెల్యేగా సిద్ధార్థ్ కొనసాగుతున్నారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డి అంటే పడదు.

 

ఎప్పుడూ నియోజకవర్గంలో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇక ఈ రచ్చ గురించి పక్కనపెడితే...సిద్ధార్థ్ డైరక్ట్‌గా ఎన్నికల బరిలో ఎప్పుడు దిగుతారని వైసీపీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నెక్స్ట్ 2024 ఎన్నికల్లో సిద్ధార్థ్ ఖచ్చితంగా పోటీ చేయొచ్చని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సిద్ధార్థ్‌కు సీటు రెడీగా ఉందా? అంటే అది చెప్పలేం కానీ..వీలుని బట్టి పాణ్యం సీట్లు బరిలో దిగొచ్చని తెలుస్తోంది.

 

నందికొట్కూరు ఎస్సీ రిజర్వడ్ కాబట్టి, సిద్ధార్థ్ జనరల్ సీటు అయిన పాణ్యం వైపు వెళ్లొచ్చని అంటున్నారు. పాణ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని  రామ్ భూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన పాణ్యం నుంచి కాంగ్రెస్ తరుపున అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగి మరోసారి విజయం సాధించారు. అయితే ఆరుసార్లు గెలిచిన కాటసానికి వయసు మీద పడటంతో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి దిగడం డౌట్‌ అని, అప్పుడే సిద్ధార్థ్ రంగంలోకి దిగుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి సిద్ధార్థ్‌కు నెక్స్ట్ ఎన్నికల్లో ఛాన్స్ దొరుకుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: