తెలంగాణలో కరోనా మరింతగా విజృంభిస్తోంది. ఏకంగా ఇప్పుడు వేలల్లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా ఏకంగా 1850 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది.

 

 

తాజాగా శనివారం ఒక్క హైదరాబాద్‌ మహానగరంలోనే 1572 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కావడం హైదరాబాద్ వాసులను భయాందోళనలకు గురి చేస్తోంది. తెలంగాణలో కొత్తగా నమోదైన 1850 కరోనా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1572 కేసులు నమోదు అయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల విషయానికి వస్తే.. రంగారెడ్డిలో 92, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 31, కరీంనగర్‌లో 18, నిజామాబాద్‌ జిల్లాలో 17 కొత్త కరోనా కేసులు వచ్చాయి.

 

 

శనివారం తెలంగాణలో మొత్తం 6427 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో1850 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 4577 నెగెటివ్‌గా వచ్చాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22,312 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీ విషయానికి వస్తే.. గడిచిన 24గంటల్లో 1342 మంది కోలుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 11,537కి పెరిగింది. తాజాగా ఐదుగురు మరణించారు. ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కరోనాతో 288 చనిపోయారు.

 

 

ఈ కేసుల జోరు చూస్తుంటే తెలంగాణలో అందులోనూ హైదరాబాద్ అంటేనే వణికిపోయే పరిస్థితి ఉంది. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. కేసులు వేలల్లో నమోదవుతున్నా.. మరణాలు మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: