వైయస్ జగన్ పరిపాలన మొదటి నుండి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని కక్షపూరితంగా వారిపై వ్యవహరిస్తున్నట్లు కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అప్పట్లో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం విషయంలో ఏకంగా సీఎం జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడు అంటూ చంద్రబాబు అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనాలు సృష్టించాయి. ఇదిలా ఉండగా ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా మద్దతుదారులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ని టార్గెట్ చేసుకుని రామకృష్ణ చౌదరి అంటూ విమర్శలు గుప్పించడం జరిగింది.

 

అంతేకాకుండా ఆయనపై లేనిపోని విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం చేయడంతో సిపిఐ నేతలు ఖండిస్తున్నారు. కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ మండిపడుతున్నారు. ప్రత్యర్థిని విమర్శించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన వారిని వైసీపీలో ఉన్నవారు విమర్శిస్తారు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే తరుణంలో తనపై దూషణ లకు పాల్పడిన వారిపై సిపిఐ నేత రామకృష్ణ కూడా మండిపడ్డారు. వైయస్ జగన్ కి రెడ్డి కులం పిచ్చి ఉందని అందుకే ఆయన చుట్టూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఆరోపించారు.

 

13 జిల్లాలకు సంబంధించి బాధ్యతలు కూడా ముగ్గురు రెడ్లు వర్గానికి చెందిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు పంచారని ఆరోపించారు. ఇదే తరుణంలో సామాన్య జనులు కూడా ప్రభుత్వం తప్పు చేస్తే కమ్మ సామాజిక వర్గం చెందిన ప్రజలు ప్రశ్నించకూడదా జగన్ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అసలు మీ పార్టీలలో ఇన్చార్జి పోస్టులు అలాగే కౌన్సిల్ సభ్యుల నియామకాలలో అందరూ ఎక్కువ శాతం రెడ్లే ఉన్నారు అంటూ మండిపడుతున్నారు. ఇలా ఇతర కులాలను టార్గెట్ చేస్తే మీకే ప్రమాదం అని సామాన్య జనులు జగన్ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: