దేశంలో జగన్ పేరు రోజురోజుకి డబల్ త్రిబుల్ అవుతుంది. కరోనా కట్టడి చేయడంలో అదేవిధంగా వలస కూలీల కు సహాయం చేసిన విషయంలో జగన్ చొరవ చూపించిన విధానం అప్పట్లో జాతీయ స్థాయిలో మీడియా ని మరియు నాయకులను ఎంతగానో ప్రభావితం చేయడం మనకందరికీ తెలిసిందే. అందువల్లే ఇటీవల జరిగిన జాతీయ స్థాయి సర్వే లో బెస్ట్ సీఎం రేసులో వైయస్ జగన్ నాలుగో స్థానాన్ని దేశవ్యాప్తంగా సంపాదించు కోవడం జరిగింది. చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు విని జాతీయ మీడియా, పత్రికలు మరియు తల పండిపోయిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఇటీవల కరోనా వైరస్ ఎదుర్కొనే క్రమంలో భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడాన్ని చాలామంది ఏపీ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకోవటం జరిగింది.

 

ఇదే తరుణంలో 1088 అంబులెన్సులను ఇటీవల జులై మొదటి తారీఖున జగన్ ప్రారంభించటం తో దేశవ్యాప్తంగా జగన్ పరిపాలన పై పెద్ద చర్చలు ఇటీవల జరిగాయి. కాగా మరోసారి జగన్ పరిపాలన పై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు, జగన్ నిర్ణయం ఆ స్థాయిలో ఉండబోతున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదేమిటంటే ఈ సారి నుండి రోజుకి 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు రాష్ట్రంలో జరగాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. దానికోసం భారీగా కరోనా టెస్టింగ్ కిట్లను జగన్ సర్కార్ సమకూర్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు అందుతున్నాయి.

 

అందుకోసం దక్షిణ కొరియా మరియు జపాన్ దేశాలనుండి కరోనా టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకోవడానికి కేంద్రాన్ని అనుమతి కోరినట్లు సమాచారం. వాస్తవ రూపంలో ఇదే గనుక జరిగితే దేశంలోనే జగన్ టాప్ సీఎంగా… ఆయన ఎడ్మినిస్ట్రేషన్ పై డిస్కషన్ లు జరగటం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: