ప్రపంచాన్ని స్దంభింపచేసిన మహమ్మారి కరోనా వైరస్.. దీని విషయంలో చాలా మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి.. వయస్సులో ఉన్న వారికి ఈ వైరస్ సోకదు, వయస్సు మళ్లిన వారికి మాత్రమే దీని వల్ల ప్రమాదం అని అనుకుంటే పొరపాటు పడినట్లేనట.. అదీగాక మాకు రోగ నిరోధక శక్తి ఎక్కువ అని భావించి ముఖానికి మాస్క్ లేకుండా, చేతులను శుభ్రపరచుకోకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తామంటే కూడా కుదరదు.. ఎందుకంటే మనుషుల రక్తం చిందించకుండా వారి ప్రాణాలను సైలంట్‌గా తీసుకు వెళ్లుతున్న కిల్లర్ కరోనా..

 

 

ఈ వైరస్‌కు వయోభేధం లేదు.. దీనికి కావలసింది మనుషుల ప్రాణాలు.. అందుకే అన్ని వయసుల వారి ప్రాణాలనూ హరిస్తోంది. ఇక ఇప్పటికే అనారోగ్యాలతో ఉండి.. వైరస్‌ బారిన పడినవారు సకాలంలో చికిత్స తీసుకోవడంలో జాప్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక తాజాగా దీని బారిన పడి 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఆరుగురు మరణిస్తే వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరంతా రక్తహీనత, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపారు.అంతే కాకుండా కాలేయ సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలిక వైరస్‌ బారినపడి ప్రాణాలు విడిచింది.

 

 

ఇకపోతే మనుషుల్లో సర్వసాధరణంగా ఉన్న లక్షణం నిర్లక్ష్యం.. దీని వల్ల కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోవడం, ఒక వేళ చేయించుకున్న వీటి ఫలితం ఆలస్యంగా రావడం, ఆ తర్వాత ఆలస్యంగా ఆసుపత్రిలో చేరడం వంటి కారణాల వల్ల కూడా మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

 

 

అయితే ఈ వైరస్ లక్షణాలు కనిపించిన 5 రోజుల్లో ఆసుపత్రుల్లో గనుక చేరగలిగి సత్వరం చికిత్స తీసుకుంటే కొన్ని ప్రాణాలు అయినా దక్కే అవకాశం ఉందని, ఇందులో కొందరికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడినప్పటికి పరీక్షలు చేయించుకోకుండా ఇష్టమొచ్చిన మందులను వాడి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని వెల్లడించారు.. చూశారా ఈ వైరస్‌ను తేలికగా తీసుకోవడం మానుకుంటే మంచిదట.. అదీగాక ఆరోగ్యం పట్ల అవగహన పెంచుకోవడం ఈ సమయంలో చాలా ఉత్తమం.. అలాగని ఆరోగ్యం పై ప్రయోగాలు మాత్రం చేయకండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: