కరోనా ఎక్కువగా 60 ఏళ్లుదాటిన వారికే ప్రమాదకరం.. యువకులను, పిల్లలను అది ఏమీ చేయదు.. ఆరోగ్యంగా ఉంటే కరోనా ఏమీ చేయదు.. ప్రాణాంతమైన రోగాలు ఉన్నవారిని తప్ప సాధారణ వ్యక్తులను కరోనా ఏమీ చేయదు.. ఇవీ కరోనా పట్ల చాలా మందికి ఉన్న అభిప్రాయాలు.. చాలా వరకూ ఇవి నిజమనే ఇప్పటి వరకూ నమ్ముతున్నారు.

 

 

కానీ.. కరోనా వైరస్‌ అన్ని వయసుల వారినీ చంపేస్తోందట. ఇప్పటికే అనారోగ్యాలతో ఉండి.. వైరస్‌ బారినపడిన వారికి.. కరోనా ప్రాణాంతకమేనట. ఇలాంటి వారి విషయంలో వయస్సుతో సంబంధం లేకుండానే మరణాలు సంభవిస్తున్నాయట. ఇప్పటికే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు.. చాలా జాగ్రత్తగా ఉండాలని నివేదికలు చెబుతున్నాయి.

 

 

ఎందుకంటే.. ఇటీవల కాలేయ సమస్యతో బాధపడుతున్న 15 ఏళ్ల కూడా కరోనా కారణంగా చనిపోయింది. 20 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్నా కొందరు రక్తహీనత, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 49 ఏళ్లలోపు వయసు ఉన్న వారు 51 మంది చనిపోయారని లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా మందికి బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలు ఉన్నవారే ఎక్కువ. మూత్రపిండాల సమస్యలు, ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కరోనా కారణంగా చనిపోయిన వారూ ఉన్నారు.

 

 

అందుకే ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధ్యమైనంత వరకూ రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నించాలి. వీరు ఏమాత్రం ఛాన్స్ తీసుకున్నా ప్రాణాలకే ప్రమాదం అన్న విషయం మరచిపోకూడదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: