జీవితంలోచాలా మంది తమకు దేవుడు అన్యాయం చేశాడని రోదిస్తుంటారు. పేదరికంలో పుట్టించాడని కొందరు.. ఆస్తులు, అంతస్తులు లేవని మరికొందరు.. ఇలా అనేక కారణాలతో తమ జీవితంపై విరక్తి పెంచుకుంటారు. ఇదే సమయంలో పరులకు ఉన్న సంపద, సౌకర్యాలు చూసి తమను తాము తక్కువగా ఊహించుకుంటారు.

 

 

ఇలా ఊహించుకోవడం వల్ల, పొరుగువారి సంపద చూసి తమకు లేదని చింతించడం వల్ల వారి జీవితం లో సంతోషమే కనిపించదు. అదే సమయంలో దేవుడు వారికి ఇచ్చిన అనేక సౌకర్యాలను వారు అస్సలు గుర్తించరు. ఉదాహరణకు చాలా మందికి చిన్నదో, పెద్దదో ఓ ఉద్యోగం అంటూ ఉంటుంది.

 

 

కానీ.. వారు తమకు సాఫ్ట్‌వేర్‌ తరహా ఉద్యోగం లేదని బాధపడుతుంటారు. అసలు విషయం ఏంటంటే.. ఆ మాత్రం ఉద్యోగం లేక ఎందరో రోడ్ల వెంట తిరుగుతుంటారు. సొంతవారికి , బంధువులకు నిరుద్యోగిగా ముఖం చూపించలేక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ ఉద్యోగికి మాత్రం తన ఉద్యోగం పట్ల తృప్తి ఉండదు.

 

 

అలాగే చాలా మందికి తమకు ఉన్న ప్లస్ పాయింట్లు గుర్తు రానేరావు ఎందుకంటే.. వాటి గురించి వారు ఆలోచించరు. అందుకే ముందు మనకు లభించిన వాటి గురించి ఆలోచించాలి. తృప్తి చెందాలి. అప్పుడు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటివైపు సాగాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: