ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ప్రజల్లో వైరస్ గురించి నెలకొన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న అంటువ్యాధి. శ్మశనవాటికల్లో కరోనా రోగులకు అంత్యక్రియలు నిర్వహిస్తే తమకు కూడా కరోనా సోకుతుందని చాలా మంది భావిస్తున్నారు. 
 
అయితే మృతదేహాల నుంచి ఇతరులకు కరోనా సోకుతున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఐ.సీ.ఎం.ఆర్ కరోనా రోగుల మృతదేహాలను తాకవద్దని ఇప్పటికే సూచనలు చేసింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను అడ్డుకుంటున్న ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలా మంది నివాస ప్రాంతాలకు దగ్గరలో కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తే వైరస్ సోకుతుందని భావిస్తున్నారు. 
 
మృతదేహాలను కాల్చే చేసే సమయంలో వచ్చే పొగ, ఆ ప్రాంతం నుంచి వచ్చే గాలి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. మృతదేహాలను పూడ్చిన ప్రాంతం నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందని నమ్ముతున్నారు. కానీ కరోనా గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవాలు వేరే ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన రోగులలో ఆరు గంటల తరువాత వైరస్ ఉండదు. మృతదేహాల నుంచి వెలువడే స్రావాలు శరీరంలోకి వెళితే వైరస్ భారీన పడే అవకాశం ఉంది. 
 
మృతదేహాల విషయంలో ఐ.సీ.ఎం.ఆర్ మార్గదర్శకాలు పాటిస్తే చాలని చెబుతున్నారు. దహనం చేసిన సమయంలో వెలువడే పొగ నుంచి వైరస్ వ్యాప్తి చెందదని.... చితాభస్మంలోను వైరస్ ఉండదని చెబుతున్నారు. మృతదేహాన్ని ఐదారు అడుగుల లోతులో పాతిపెడతారు కాబట్టి ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: