ఇతర దేశాల నుంచి దండుగా వస్తున్న మిడతలనే ఎడారి మిడతలు అంటారు. ఇవి ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్ దేశాల్లో పుట్టి ఖండాంతరాలకు ప్రయాణిస్తుంటాయి. అత్యంత వినాశకారిగా పేరున్న ఈ మిడతలు రోజుకు గాలివాటంలో 100 కిలోమీటర్ల వరకూ వెళుతుంటాయి.  ఇవి అయిదారు వారాల్లో అన్ని రకాల పంటలను, చెట్ల ఆకులను, గడ్డిని తింటూ అయిదారుసార్లు కుబుసం(పాత చర్మం) విడుస్తూ పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటూ, చివరి కుబుసం విడిచే దశ తర్వాత రెక్కలున్న పెద్ద మిడతలుగా మారతాయి. ఒక్కో దండులో ఐదారు కోట్ల మిడతలు ఉంటాయి.  జిల్లేడు, బొంబై మిడతలతోపాటు మరికొన్ని రకాల మిడతలు ఉన్నాయి. జిల్లేడు మొక్కలపై జీవించడం వల్ల వీటిని జిల్లేడు మిడతలు అంటారు.

IHG

ఆకుపచ్చ రంగులో ఉండి పసుపు పచ్చ గీతలు ఉంటాయి. వేరే రకాల మొక్కలపై లేదా పంటలపై ఇవి వాలవు.  బొంబాయి మిడత మరో రకం మిడత. ఇది సాధారణంగా అన్ని రకాల మొక్కలపై కనిపిస్తుంది. 1927కు ముందు ఈ మిడతలు దండు రూపంలో తిరిగేవని ఆ తర్వాత అలా రాలేదని సైంటిస్టులు గుర్తించారు.  సోమాలియా దేశం నుంచి మిడతల దండు భారత-పాక్ సరిహద్దుల్లోని ప్రాంతాలకు వలస వచ్చే అవకాశమున్నందున 6 రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అప్రమత్తం చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పంటలు నష్టపోకుండా మిడతల నియంత్రణకు మిడత సర్కిల్ కార్యాలయాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ ఆదేశించింది. 

IHG

అంతే కాదు ఆఫ్రికా నుంచి వచ్చే మిడతల దండు మన దేశంలోని 6 రాష్ట్రాల్లో తీవ్ర మైన పంటనష్టం కలిగించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయశాఖ హెచ్చరించింది. ఎడారి మిడతలు రోజుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని, చదరపు కిలోమీటర్ల మిడతల సమూహం ఒక రోజులో 35వేల పంటలను తింటాయని అంచనా వేశారు. దీంతో మిడతల దండును నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: