ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడటానికి శాస్త్రవేత్తలు చాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కోసం యుద్ధమే చేస్తున్నారు అనుకోండి. అయితే కరోనాకి మాగ్జిమం షాక్ ఇవ్వాలంటే యాంటీ వైరల్ మాత్ర రెమ్‌డెసివిర్ చాలదు అంటున్నారు.

 

 

మరికొన్ని రకాల మందుల్ని కలిపి వాడాలంటున్నారు అమెరికా పరిశోధకులు. యాంటీ -ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్‌గా పిలిచే బారిసిటినిబ్ ని కూడా వాడాలంటున్నారు. దీన్ని జనరల్‌గా రూమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు వాడుతున్నారని తెలియజేశారు.

 

 

అయితే నెల రోజులుగా ఈ కాంబినేషన్‌లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌తో మరో రూమటాయిడ్ ఆర్థరైటిస్‌కి టాబ్లెట్ అయిన టోసిలీజుమాబ్  కూడా కలిపి వాడొచ్చని గిలీడ్ సైసెన్స్ సంస్థ తెలియజేస్తుంది. ఈ మందును అక్టెమ్రా పేరుతో అమ్ముతున్నారన్నారు.

 

 

రెమ్‌డెసివిర్‌తో మరో మూడు, నాలుగు రకాల మందులను కలిపి వాడాలంటున్నారు శాస్త్రవేత్తలు. తద్వారా వైరస్‌కి చెక్ పెట్టడమే కాక బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచవచ్చంటున్నారు. అలాగే జ్వరం తగ్గేందుకు... కూడా అవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

 

 

కన్వాలెసెంట్ ప్లాస్మా కూడా ఇందుకు పనికొస్తుందని తెలిపారు. ఈ ప్లాస్మాను కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల నుంచి సేకరిస్తున్నారు. దీనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. అమెరికాలో ఇప్పటికే 25వేల మంది ప్లాస్మా ఇచ్చారు. ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల్లో ప్లాస్మా ట్రీట్‌మెంట్‌తో కరోనా పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ విధానం ద్వారా అమెరికా ప్లాస్మాను ఏడాది పాటూ స్టోర్ చేసేలా నిర్మాణాలు చేపట్టిందన్నారు.

 

 

కామన్ స్టెరాయిడ్ డెక్సామెథసోన్ కూడా కరోనా మరణాల్ని మూ‌డొంతుల వరకూ ఆపగలుగుతోందని ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. రెమ్‌డెసివిర్ వాడకం బాగా పెరగడంతో... దాన్ని త్వరలోనే ఇన్హేలర్ రూపంలోకి తేవాలని డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పై మందులను ప్రజలు వ్యక్తిగతంగా వాడకూడదు. డాక్టర్ల సలహాలు, సూచనలు, పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: