దేశమంతా ఎక్కడ చూసినా కరోనా .. ఎటు చూసినా కరోనా... ఈ మాటే వినబడుతుంది. దేశంలో రోజూ రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని రోజులు చూసిన కరోనా వ్యాప్తి నియంత్రణ కాకపోవడంతో ఇక రోజువారీ కార్యక్రమాలు మెల్లగా మొదలవుతున్నాయి. అయితే వీటికి ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చింది.

 

 

ఇంక కొన్ని వ్యాపారాలు,సంస్థలకు అనుమతులు కూడా ఇవ్వలేదు. అసలే ఈ సమయం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ఒకవేళ పెళ్లి చేసుకునేలా ఉంటే అతి తక్కువ మందితో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సామాజిక దూరం పాటిస్తూ వివాహ వేడుక జరుపుకోవాలి.

 

 

ఇప్పటికే చాలా చోట్ల ఈ విధానం ద్వారా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది తక్కువ మందితో వివాహ కార్యక్రమం జరుపుకుంటామని అనుమతులు తీసుకొని ఎక్కువ మందిని వేడుకకు ఆహ్వానిస్తున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఒడిశా లో జరిగింది.

 

గంజాం జిల్లాలో ఈ నెల 2న వివాహం జరగ్గా అనంతరం పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారు ఒక్కరు కూడా మాస్కు ధరించకుండా భౌతిక దూరాన్ని గాలికి ఒదిలేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

 


కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వరుడుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వివాహం జరిగిన ‘హోటల్ మై ఫెయిర్’ను సీజ్ చేయడంతోపాటు వరుడు అతని బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

దానితోపాటు ఊరేగింపులో ఉపాయిగించిం వాహనాలను సీజ్ చేసినట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. ఏదేమైనా కరోనా నేపథ్యంలో హడావిడి గా పెళ్లి వేడుక జరుపుకోవడమెంటని ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మన ఆరోగ్యం మనమే కాపుడుకోవాలని అది అందరి బాధ్యత అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: