ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉపవాసం వల్ల పుణ్యం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి చాలా  మంచిది అని తెలుసుకోండి. ఉపవాసం చేస్తే మనకు ఏం లభిస్తుంది...?  ఈ ఉపవాసం గురించి మనం వినడం కొత్తేమీ కాదు. మన పురాతన కాలం నుంచి దీనిని అందరూ పాటిస్తూనే ఉన్నారు. పండుగలకి పర్వదినానికి ఉపవాసం ఉండడం మన సాంప్రదాయం. కొందరు పర్వ దినాలు నాడు, పండుగల నాడు మాత్రమే ఉపవాసం చేస్తే మరి కొందరు వారానికి ఏదో ఒక రోజు తప్పకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు.

 

అయితే క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు సైన్స్ కూడా ఉపవాసాలు మంచిదని చెబుతోంది. ఉపవాసం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా జీవ క్రియలు సజావుగా సాగడానికి ఉపయోగ పడుతుంది. అలానే గుండె సమస్యలు , అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే శరీరం మీద ఉపవాసం ప్రభావం గురించి అనేక చర్యలు జరిగాయి. అయితే వీటిలో చెప్పింది ఏంటంటే విష పదార్థాలను తొలగించడానికి ఉపవాసం సహాయ పడుతుంది.

 

అలానే ప్రస్తుత పోషకాహారలో ముఖ్యమైన భాగంగా ఉపవాసం కూడా ఉంది అంటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో దీని ద్వారా మనకి లభిస్తాయి. శరీరం లో కాలేయం మూత్రపిండాలు రెండు మన శరీరం నుంచి విషాలని నిరంతరం తొలగిస్తాయి. అయితే నిరంతరం పని చేసే జీర్ణ వ్యవస్థకు కొంత ఊరట కూడా ఈ ఉపవాసం వల్ల ఉంటుందని న్యూట్రీషన్లు కూడా సూచించారు .  కాబట్టి ఉపవాసం వల్ల కేవలం పుణ్యం మాత్రమే ఉంటుందంటే అది నిజంగా పొరపాటు ఉపవాసం వల్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: