శుక్రవారం కాన్పూరులో జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన  విషయం తెలిసిందే. రౌడీ షీటర్ వికాస్ దూబే ను అరెస్టు చేసే క్రమంలో అతను వున్న ఇంట్లోకి రైడింగ్ వెళ్లిన పోలీసుల పై దుండగులు కాల్పులు జరపడంతో 8మంది పోలీసులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈఘటనను సీరియస్ గా తీసుకున్న యూపీ పోలీసులు వికాస్ దూబే కోసం జల్లెడ పడుతున్నారు. కాగా అతని ప్రధాన అనుచరుడు దయాశంకర్ అగ్నిహోత్రి ని పోలీసులు కళ్యాణ్ పూర్ లో అరెస్టు చేశారు. విచారణ లో భాగంగా అగ్నిహోత్రి కీలక విషయాలను వెల్లడించాడు. 
 
అతన్ని అరెస్టు చేయనున్నారని వికాస్ దూబే కు ముందే సమాచారం వచ్చింది. పోలీస్ స్టేషన్ నుండే దూబే కు ఎవరో కాల్ చేసి చెప్పారు. దాంతో అప్రమత్తమైన దూబే వెంటనే 25 నుండి 30మందిని పిలిపించాడు. దూబేను పట్టుకునేందుకు పోలీసులు రావడంతో వారిపై  కాల్పులు జరిపారు. వికాస్ దూబే కూడా పోలీసులపై ఫైరింగ్ చేశాడు. నన్ను ఓ రూమ్ లో బంధించడంతో  నాకు బయట ఏం జరిగిందో తెలియలేదని దయాశంకర్ అగ్నిహోత్రి వెల్లడించాడు. ఇదిలావుంటే వికాస్ దూబే పై 60 పైగా క్రిమినల్ కేసులున్నాయి రాజకీయ నాయకులతో పరిచయాలుపెంచుకొని నేర సామాజ్య్రంలోకి ఎంటర్ అయ్యాడు. ఎమ్మెల్యే గా గెలవడం కోసం వికాస్ దూబే, మంత్రి సంతోష్ శుక్లాను కూడా హతమార్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: