దేశంలో భయంకరంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. రోజు రోజుకి వైరస్ వ్యాప్తి చెందటంతో బయటపడుతున్న కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే  ఐదు లక్షలకు పైగానే దాటిపోయినా పాజిటివ్ కేసులు ఈ వర్షాకాలం అయ్యేలోపు దాదాపు 80 లక్షల మేరకు దేశవ్యాప్తంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటం వలన ప్రజలలో కరోనా భయం లేకపోవటంతో పాటుగా కరోనా నిబంధనలను పాటించకపోవడంతో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి దేశంలో ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. పోలీసులు మరియు ప్రజాప్రతినిధులకు కూడా కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తున్న తరుణంలో దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు కిందామీదా పడుతున్నయి.

 

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉన్న తరుణంలో చాలామంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా వెల్లడించారు. తనకి కరోనా సోకినా కూడా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఈ విషయం తెలిసిన వెంటనే తాను హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.

 

ఇటీవల ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టైములో  ఆ సమయములో కిలారి రోశయ్య పాల్గొనటంతో అప్పటికె  ఆయనకి కరోనా ఉన్నట్లు బయటపడటంతో ఆయనతో కలిసిన నాయకులకు ఇప్పుడు టెన్షన్ నెలకొంది. దీంతో అధికారులు ఎమ్మెల్యే తో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కాగా గతంలో ప్రజల మధ్య కిలారి రోశయ్య ఎక్కువగా పర్యటనలు చేయడం తో కరోనా సోకినట్లు భావిస్తున్నాడు. దీంతో అధికార పార్టీ వైకాపా ఎమ్మెల్యేలకు జనాల్లోకి వెళ్ళటానికి వణికిపోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: