తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో అత్యధిక శాతం హైదరాబాద్ నగరంలో నమోదు అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు. దేశంలో అతి ప్రధాన నగరాల్లో ఒకటి హైదరాబాద్ నగరం అని. కానీ హైదరాబాద్ నగరం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉందని చెప్పుకొచ్చారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందువల్లే ఇలాంటి పరిస్థితి హైదరాబాదులో నెలకొన్నట్లు విమర్శలు చేశారు.

 

మరిముఖ్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలంటే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి వంటి వివరాలు విషయంలో ప్రజలకు తెలియని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. ఇదిలా ఉండగా అసలు హైదరాబాద్ నగరం లో కిషన్ రెడ్డి చెప్పినంత గా పరిస్థితి పెద్దగా లేదని కొంతమంది అంటున్నారు.

 

వైరస్ వ్యాప్తి మిగతా నగరాలలో ఎలా ఉందో అదే రీతిలో ఉందని, ఎందుకంటే హైదరాబాదు నగరం కేంద్రంగా చాలా రాకపోకలు జరగటం వల్ల పరిస్థితి ఈ మాత్రం ఉండటం లో తప్పు లేదని అంటున్నారు. కానీ కరోనా వల్ల మరణాల సంఖ్య విషయంలో అసలు హైదరాబాద్ లో పెద్ద ఎఫెక్టు లేదని చెప్పుకొచ్చారు. మరోపక్క ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు భారీ స్థాయిలో చేయించడానికి కరోనా కిట్లు కేంద్రం నుండి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆగస్టు నెల మొదటి వారంలోపు హైదరాబాద్ నగరంలో పరిస్థితులు అంత కంట్రోల్ లోకి వస్తాయి అని చాలా మంది భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: