భారత్ ఎల్లప్పుడూ ఇతర దేశాలతో స్నేహమే కోరుతుంది. సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందువరసలో ఉంటుంది. అందువల్లే ప్రపంచ దేశాలలో భారత్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్ అనవసరంగా వివాదాలను సృష్టించడానికి ఇష్టపడదు. అదే సమయంలో భారత్ భూభాగాలను ఇతర దేశాలు ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఆ దేశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. 
 
ఏ దేశమైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ ధీటుగా బదులిస్తుంది. ఇప్పటికే భారత్ చైనాకు వరుస షాకులిస్తోంది. 59 చైనా యాప్ లపై భారత్ నిషేధం విధించటంతో పాటు మన దేశంలోని హైవే ప్రాజెక్టుల నిర్మాణాల్లో చైనా కంపెనీలను నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్ చైనా తో పాటు చైనాకు మిత్ర దేశమైన పాకిస్తాన్ వస్తువులపై కూడా నిషేధం విధించాలని భావిస్తోంది. ప్రభుత్వం ప్రత్యక్షంగా నిషేధం విధించకపోయినా ప్రజలు ఆ దేశాల ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది. 
 
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింహ్ విద్యుత్ రంగంలో అవసరం ఉన్న పరికరాలను దిగుమతి చేసుకోవద్దని ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. విద్యుత్ రంగ ఉత్పత్తులను కేంద్రం అనుమతి లేకుండా చైనా నుంచి దిగుమతి చేసుకోవద్దని మంత్రి చెప్పటానికి ప్రత్యేకమైన కారణం ఉంది. విద్యుత్ పరికరాల ద్వారా చైనా మాల్వేర్ ను భారత్ కు పంపుతున్నట్లు తాజాగా వెల్లడైంది. 
 
చైనా, పాక్ నుంచి ఉత్పత్తులను కొంటే భారత్ పవర్ గ్రిడ్ లను ఆయా దేశాలు షట్ డౌన్ చేసే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశీయ విద్యుత్ కోసం అవసరమైన వాటిని భారత్ సొంతంగా తయారు చేసుకోగలదు. మన దేశానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. చైనా, పాక్ విద్యుత్ ఉత్పత్తులపై నిషేధం విధించడం ఆ దేశానికి భారీ షాక్ అనే చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: