చైనా భారత్ దేశాల సైనికుల మధ్య గత నెల 15వ తేదీన గాల్వన్ లోయ ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు మృతి చెందారు. భారత్ సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించిన 40 మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టారు. అయితే గాల్వన్ లోయ ఘర్షణకు సంబంధించిన కొత్త విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణ వల్ల చైనాలోనే అంతర్యుద్ధ వాతావరణం నెలకొందని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు చైనాకు వ్యతిరేకంగా మెలుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చైనా కరోనా విషయంలో తమను అలర్ట్ చేయలేదని పేర్కొంది. చైనా ఏ దేశం భూభాగాలను ఆక్రమించాలని ప్రయత్నిస్తోందో ఆ దేశాలు డ్రాగన్ పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. కరోనా విజృంభణ తరువాత పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. 
 
దీంతో చైనాలో ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయి. చైనాలో 2కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా ఆ దేశాల్లోని ప్రముఖ పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా వాళ్లను జాతీయ భావం వైపుకు మలిచేందుకు చైనా దుందుడుకు ధోరణిని అవలంబిస్తోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సైనికుల మరణాలను అధికారికంగా ప్రకటించకపోవడం వల్ల అక్కడ తిరుగుబాటు ధోరణి వస్తోంది. 
 
చైనాలోని ఒక ప్రముఖ పత్రికలో జిన్ పింగ్ కు వ్యతిరేకంగా సర్వీస్ లో ఉన్నటువంటి 57 మిలియన్ల రిటైర్డ్, సర్వీస్ చైనా ఆర్మీ సాయుధ పోరాటం ప్రారంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ దేశపు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జియాన్ జియాంగ్ పేర్కొన్నాడు. చైనా సైనికుల మరణాల వివరాలు చెప్పకపోవడం, భారత్ అమరవీరులకు ఘన నివాళులు ఇవ్వడంతో అక్కడ వ్యతిరేకత వ్యక్రమవుతోంది. దీంతో చైనాకు సొంత ఆర్మీ షాక్ ఇవ్వడానికి ఎన్నో రోజులు పట్టదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: