పాక్ దేశాల మధ్య చైనా  ఓ కారిడార్ ను నిర్మిస్తోంది.  ఈ కారిడార్ పూర్తయితే ఆ రెండు దేశాల మధ్య వర్తకం రోడ్డు మార్గంలో జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.  దీనికోసం చైనా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విష‌యంపై  చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. సీపీఈసీ ప్రాజెక్టు పురోగతిపై శనివారం జరిగిన రివ్యూలో మాట్లాడిన ఇమ్రాన్.. దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కారిడార్ చైనా-పాక్ ఫ్రెండ్ షిప్ కు నిదర్శనం. ఎంత ఖర్చయినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తాం. ప్రతి పాకిస్తానీకి దాని ఫలితాలు అందుతాయ‌ని  ఇమ్రాన్ అన్నారు.

 

ఇదిలా ఉండ‌గా కొంతకాలంగా  పీవోకే విషయంలో ఇండియా గట్టి పట్టుబడుతున్నది.  ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని ఇండియా రద్దు చేసింది.  దీంతోపాటుగా జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిడంతో పాక్ షాక్ అయ్యింది. భార‌త్ పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకుంటుంద‌ని ఊహిస్తున్న పాకిస్థాన్ పాల‌కులు చైనాతో క‌ల‌సి కారిడార్ నిర్మాణానికి వేగంగా పావులు క‌దుపుతున్నారు. పాకిస్థాన్ -చైనాల కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన మోదీ-షా ద్వ‌యం ఇప్పుడు పీవోకే స్వాధీనంపైనే పూర్తిగా దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో పీవోకే మాదే అంటూ..దానిని త్వ‌ర‌లోనే భార‌త్‌లో క‌లుపుకుంటామ‌ని షా ఉద్ఘాటించిన విష‌యం తెలిసిందే. 

 

భార‌త ప్ర‌జ‌లు కూడా ఆ స్వ‌ప్నం కోసం వేయి క‌నుల‌తో ఎదురు చూస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న పీవోకేను ఇండియా తిరిగి స్వాధీనం చేసుకుంటే ఆ కారిడార్ పై ఇప్పుడు రెండు దేశాలు ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇండియా చైనా మధ్య కూడా పోరు జరుగుతున్న వేళ ఇమ్రాన్‌ఖాన్ కావాల‌నే భార‌త్‌ను రెచ్చ‌గొట్టేందుకే ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అయితే భార‌త్‌కు మాత్రం పీవోకే విష‌యంపై ప‌క్కా వ్యూహంతో.. స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే యుద్ధంతో సైతం దానిని స్వాధీనం చేసుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. అంతే కాక పీవోకేలో పాక్ దురాగ‌త‌ల‌కు వ్య‌తిరేకంగా భార‌త్‌కు జ‌నాల మ‌ద్ద‌తు ఉండ‌టం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: