చేసిన పని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చేసిన పనిని పదే పదే చెబితే మాత్రం...పెద్ద డప్పు కొట్టుకున్నారని అనిపిస్తోంది. కరెక్ట్‌గా ఇదే పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో జరుగుతుంది. ఆయనకు ఏ విషయన్నైనా పదే పదే చెప్పడం అలవాటు. కాకపోతే అలా చెప్పడం వల్ల జనాలకు బోరు కొడుతుంది. ప్రత్యర్ధి పార్టీలు ఎగతాళి చేస్తున్నాయి.

 

గతంలో చంద్రబాబు సీఎంగా పనిచేసేప్పుడు ఉమ్మడి ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. ముఖ్యంగా హైదరబాద్ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి చెందడంలో బాబు పాత్ర చాలా ఉంది. ఇంకా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు బాబు హయాంలోనే జరిగాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి ప్రధాన మంత్రులని ఎంపిక చేశారు.

 

అయితే ఇప్పటికీ ఈ విషయాలని బాబు చెప్పుకుంటూ ఉంటారు. దాని వల్ల చంద్రబాబు ప్రజల్లో చులకన అయిపోతూ వచ్చారు. దీంతో ఆయన ఏ విషయాన్ని గొప్పగా చెప్పుకున్నా కూడా...డప్పు కొట్టుకుంటున్నారనే భావన పెరిగిపోయింది. ప్రత్యర్ధి పార్టీలు సైతం చంద్రబాబు ఏమి మాట్లాడినా.. ఎగతాళి చేస్తూ మాట్లాడటం చేస్తున్నారు. తాజాగా ఓ విషయంలో కూడా బాబుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనాకు హైదారాబాద్ కేంద్రంగా జీనోమ్‍ వ్యాలీలో ఉన్న భార‌త్ బ‌యోటెక్ సంస్థ వ్యాక్సిన్‌ని తయారుచేస్తున్న విషయం తెలిసిందే. కరోనా నివారణకు  ‘కోవ్యాక్సిన్’ అనే వ్యాక్సిన్‌ని ఆగ‌స్టు15 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఐసి‌‌ఎం‌ఆర్ ఇటీవల ప్రకటన చేసింది. ఇక ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ..కరోనా వైరస్‍ నివారణకు వ్యాక్సిన్‍ సిద్ధం చేస్తున్న భారత్‍ బయోటెక్‍ సంస్థ యాజమాన్యానికి ఫోన్‍ చేసి అభినందనలు చెప్పానని, ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసిన కృషి వల్లే బయోటెక్నాలజీ రంగంలో ఇంత పురోగతి సాధ్యమైందని, జీనోమ్‍ వ్యాలీ ఆసియాలోనే నెం.1గా ఉందని వారు తనతో చెప్పారని తెలిపారు.

 

ఇక దీనిపై వైసీపీ శ్రేణులు రచ్చ చేయడం మొదలు పెట్టాయి. బాబు డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టారని, వ్యాక్సిన్ ఏదో తానే కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ శ్రేణులకు తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్... జీనోమ్ వ్యాలీ ప్రారంభించింది చంద్రబాబు హయాంలోనే అని మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జీనోమ్ వ్యాలీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదే అని కేటీఆర్ డైరక్ట్‌గా చెప్పారని, అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ దృష్టిలో ఆయన కూడా బాబుకు డప్పు కొట్టారా? అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: