అధికార వైసీపీలో యువ సంచలనాలకు ఎలాంటి కొదవ లేదు. ఆ పార్టీలో బోలెడు మంది యువనాయకులు ఉండగా, అందులో కొందరు మాత్రం ఏడాది కాలంలోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుతున్నారు. అలా ఏడాదిలోనే విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని టాప్‌లో ఉన్నారు.

 

ఎన్‌ఆర్‌ఐ అయిన రజిని టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో, ఆ పార్టీలో చేరి చిలకలూరిపేటలో ముఖ్యనాయకురాలుగా ఎదిగారు. అప్పుడు మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులుగా నడుచుకున్నారు. అయితే ఆర్ధికం బలంగా ఉన్న రజిని ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యి, టీడీపీలో ఉంటే టిక్కెట్ దక్కడం కష్టమని భావించి, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు.

 

ఇక ఆర్ధికంగా బలంగా ఉండటం, అదే సమయంలో చిలకలూరిపేటలో ఉన్న వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వీక్ కావడంతో జగన్..రజినికి సీటు ఇచ్చారు. అయితే అప్పటికే పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రత్తిపాటికి చెక్ పెట్టడం రజిని వల్ల కాదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రజిని 8 వేలు మెజారిటీతో ప్రత్తిపాటిని ఓడించారు.

 

అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన దూకుడుగా పని చేస్తున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అసలు ఏడాది కాలంలోనే ఆమె ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. నాలుగైదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారే రాష్ట్రం మొత్తానికి తెలియదు. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజిని...రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ పెంచుకున్నారు. ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న రజిని...ప్రత్తిపాటికి మరోసారి గెలిచే ఛాన్స్ ఇవ్వరని, పేట రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ప్రత్తిపాటికి ఎప్పుడో చెక్ పెట్టేశారని, అలాగే సొంత పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్‌కు మరో అవకాశం లేకుండా చేసి, నెక్స్ట్ ఎన్నికల్లో బెర్త్ ఖాయం చేసుకున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: