ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావడం లేదు. జగన్‌ని ప్రజల్లో ఎంత నెగిటివ్ చేద్దామనుకున్న కుదరడం లేదు. పోనీ జగన్ తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పి జనాల్లో ఏమన్నా సింపతీ కొట్టేద్దామన్న అది అవ్వడం లేదు. ఎక్కడికికక్కడ జగన్ అదిరిపోయేలా స్ట్రాటజీ ప్లే చేస్తుండటంతో చంద్రబాబు ప్లాన్స్ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. 

 

తాజాగా కూడా చంద్రబాబు...టీడీపీ నేతల అరెస్ట్‌లని రాజకీయంగా వాడుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వగా, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. ఇక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై పలు కేసులు ఉండగా, ఆయన కూడా త్వరలోనే అరెస్ట్ కావొచ్చని ప్రచారం జరుగుతుంది.

 

అయితే వరుసగా టీడీపీ నేతల అరెస్ట్‌పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. బీసీ నేతలపై జగన్ కక్ష తీర్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు. బీసీలని అణిచివేయాలని చూస్తున్నారని రాజకీయ విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బీసీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కుట్రచేస్తున్నారని, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర వంటి బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని బాబు తెగ హడావిడి చేస్తున్నారు.

 

ఇక బీసీ కార్డు వాడి ప్రజల్లో సానుభూతి సంపాదించాలని బాబు ప్రయత్నిస్తున్నారని బాగా అర్ధమవుతుంది. కానీ ప్రజలు మాత్రం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. టీడీపీ నేతలు తప్పు చేశారు కాబట్టే, జైలు శిక్షలు పడుతున్నాయని వదిలేస్తున్నారు. ఇందులో జగన్ కూడా ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని భావన ప్రజల్లో లేదనే చెప్పాలి. పక్కా ఆధారాలతోనే జగన్ ముందుకెళుతున్నారని, అందుకే వరుసగా టీడీపీ నేతలు బుక్ అవుతున్నారని జనం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: