జగన్.. విలక్షణ రాజకీయ నాయకుడు. యువ ముఖ్యమంత్రి. అయితే ఆయన భావాలు, రాజకీయ పోకడలు డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే జగన్ కి ఈ విజయాలు, ముఖ్యమంత్రి పదవి అంత సునాయాసంగా లభించలేదు. ఎన్నో ఢక్కా మెక్కీలు తిన్న తరువాతనే అవి దక్కాయి. అందువల్ల జగన్ ఒక్కో మెట్టు ఎక్కి ఇపుడు సింహాసనం మీద కూర్చున్నారు. దాంతో జగన్ లెక్కలు జగన్ కి ఉన్నాయి.

 

తన రాజకీయ తులాభారంలో బరువు తూగిన వారే తన వారు అవుతారు. ఇదీ జగన్ పక్కా ఆలోచనా. తులాభారంలో తూగేది వేరేది కాదు, విధేయత. విశ్వాసం. జగన్ మీద ఎటువటి పరిస్థితుల్లో అయినా నమ్మకంతో ఉండేవారిని ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలా పదేళ్ళుగా తనతో కలసి అడుగులు వేసిన వారినే ఆయన అక్కున చేర్చుకున్నారు అంటారు.

 

ఇక జగన్ కి వైఎస్సార్ నుంచి కలసి వచ్చిన నాయకులు పెద్దగా లేరు. అలా  వచ్చిన వారు కూడా చివరి దాకా  నిలవలేదు. జగన్ అంటే పడి చచ్చే వారే ఆయన్ని అంటిపెట్టుకుని వున్నారు. ఈ రోజు వారే పదవులు వైభోగం అనుభవిస్తున్నారు. జగన్ తనను కాదని వెళ్ళిపోయిన వారిని మళ్లీ పిలిచిన దాఖలాలు లేవు. ఒక వేళ వచ్చినా కూడా వారిని సమాదరించినది
కూడా తక్కువే. అయితే అందులో ఒక్క నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు మినహాయింపు.

 

ఆయన 2014 తరువాత జగన్ నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయన బీజేపీ, టీడీపీలలో చేరి జగన్ని ఎన్నో మాటలు అన్నారు. అయినా సరే జగన్ ఆయన్ని నమ్మి టికెట్ ఇచ్చారు. ఎంపీ అయ్యారు. ఇపుడు కూడా రాజుగారి జగన్ని విమర్శిస్తున్నారు. దీంతో జగన్ మరింత గట్టిగా విధేయత విషయంలో ఉండాలనుకుంటున్నారుట. తనకు విధేయులు అయిన వారు ఎవరైనా ఫరవాలేదు, వారి కోసం తాను ఎందాకైనా వెళ్తానని జగన్ నిరూపిస్తున్నారు.

 

మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వంటి వారిని రాజ్యసభకు జగన్ పంపడాన్ని వైసీపీలో ఉదహరిస్తున్నారు. అలాగే వైసీపీలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా అయిన వారు ఉన్నారు. అలాగే మంత్రి వర్గ  కూర్పుని కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి జగన్ రాజు గారి ఎపిసోడ్ తో మరింత జాగ్ర‌త్తగా పార్టీలో నాయకుల మీద చూపు సారిస్తున్నారు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: