నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన విషయం అందరికి తెలిసిందే. మొదటి నుండి జగన్ తీసుకున్న నిర్ణయాల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఓ వర్గం మీడియా కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ ఇస్తూ జగన్ సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉండటం జరిగింది. ఇటీవల వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిపరులు అంటూ మీడియా ముందు పార్టీ పరువు తీసే విధంగా వ్యాఖ్యలు చేయటం అందరం చూశాం. దీంతో వైసీపీ హైకమాండ్ ఇటీవల రఘురామకృష్ణంరాజు కి పార్టీ షోకాజ్ నోటీసులు అందించడం జరిగింది. ఈ నోటీసుల విషయంలో పార్టీ పేరు సరిగ్గా లేదని రఘురామకృష్ణంరాజు జగన్ పార్టీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ పేరు ఒకలా ఉంటే నాకు వేరే పార్టీ పేరు మీద షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని, నా మీద జగన్ పార్టీ కుట్ర పన్నినట్లు మీడియా ముందు రఘురామకృష్ణంరాజు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా రఘురామ కృష్ణంరాజు సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అది ఏమిటంటే ఏపీ రాజధానిగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఇటీవల ఆ ఉద్యమం 200 రోజులకు చేరుకున్న నేపథ్యంలో ఉద్యమం చేస్తున్న రాజధాని రైతుల పట్ల రఘురామకృష్ణంరాజు సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా ఇది జగన్ వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి అంటూ సూచించారు.

 

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం అంకితభావం గొప్పదని రోజు గమనిస్తున్నా అంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా గుర్తించింది ప్రభుత్వ నిర్ణయమని... ప్రభుత్వాలు కొనసాగుతుంటాయి అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా నిండు సభలో పైగా జగన్ కూడా అదే చెప్పటం జరిగిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇది కేవలం మూడు రాజధానుల పై తన పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: