ఒకవైపు ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, ప్రజల్లో రోజురోజుకు పట్టు పెంచుకునే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నిబంధనలు విధించడంతో, రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా, ఎక్కడా జగన్ సంక్షేమ పథకాలను ఆపకుండా, కొత్త కొత్త పథకాలను అమలు చేస్తూ, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడమే కాకుండా, అనేక రాష్ట్రాల జగన్ తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ, ఎప్పటికప్పుడు జగన్ పరిపాలనను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొనడం, పార్టీ నేతలు స్వీయ తప్పిదాల కారణంగా జైలు పాలవుతున్నారు. ఇటువంటి ఎన్నో పరిణామాలతో, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

IHG'save Amaravati' movement - The Hindu

ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒక అంశంపై జనాల్లో ఉండకపోతే, రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రా,యంతో ఉన్న చంద్రబాబు, అకస్మాత్తుగా క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు తెలియజేసే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే అమరావతి రైతులు చేసిన పోరాటం 200 రోజులు దాటింది. ఈ సందర్భంగా వారికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు బాబు ప్రణాళిక రచించారు. ఎప్పటి కుచో జూన్ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వస్తున్న బాబు ఇప్పుడు మాత్రం ఏపీ లోని అన్ని జిల్లాల నియోజకవర్గాలు. మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని, ఆయన సూచించారు.

IHG

హౌసింగ్ పెండింగ్ బిల్లులు, గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు స్వాధీనం చేసుకోవడం, తెలుగుదేశం హయాంలో నిర్మించిన నూతన భవనాలను ఇంకా కేటాయించకపోవడం వంటి విషయాలపై ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎనిమిదో తేదీన వైసిపి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ, చేయబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి క్రెడిట్ దక్కకుండా చంద్రబాబు ఇంత ఆకస్మాత్తుగా ఈ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు గా అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: