అడ్డు అదుపు లేకుండా, రోజురోజుకు మరింత తీవ్రతరం అవుతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు ఒక్క రాష్ట్రం ఒక్కో తరహా నిబంధనలు అమలు చేసి, ఈ కరోనా ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ విధంగానే కేరళ ప్రభుత్వం కూడా, కరోనా కట్టడికి అనేక కఠిన నియమనిబంధనలు రూపొందించింది. ఇప్పటికే కేరళ అనుసరిస్తున్న విధానాలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కరోనా కట్టడి కోసం మరిన్ని సరికొత్త నిబంధనలను రూపొందించింది. 2021 జూలై వరకు రాష్ట్రంలో నిబంధనలు తప్పనిసరిగా అందరూ పాటించాలని, మనిషికి మనిషికి మధ్య దూరం కనీసం ఆరడుగులు ఉండేలా చూసుకోవాలని, అనేక జాగ్రత్తలను పాటించాలని సూచిస్తూ ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. కేరళ ఎపిడిమిక్ థిస్ ఇస్ కరోనా వైరస్ డిసీజ్ అడిషనల్ రెగ్యులేషన్స్ 2020 పేరిట కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

 

IHG's death, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KERALA' target='_blank' title='kerala-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kerala</a> Covid-19 toll reaches 25


ఈ కొత్త చట్టం ప్రకారం విధించిన నిబంధనలు

వారు వీరు అనే తేడా లేకుండా, బయట తిరిగే వారైనా, కార్యాలయాల్లో పనిచేసే వారు ఎవరైనా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నోరు,  ముక్కులను కవర్ చేసే విధంగా మాస్కులు ధరించాలి.


మనిషికి మనిషికి మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని, ఎక్కడా, గుంపులు గుంపులుగా సంచరించకూడదు .

పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు వద్ద 50 మందికి మించి జనాలు ఉండకూడదని, అక్కడ కూడా తప్పనిసరిగ కోవిడ్ నిబంధనలు పాటించాలని, శానిటైజర్, మాస్కులు విధిగా ధరించాలని, దూరం పాటించాలి.
అలాగే అంత్యక్రియలకు హాజరు అయ్యే వారి సంఖ్య 20కి మించకుండా, తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు విధించారు.

 

IHG

ఎటువంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, మీటింగులు నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. అలాగే బాగా అత్యవసరమైతే, తప్ప 10 మందికి మించి  కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలు లేకుండా, నిబంధనలు రూపొందించారు. ఇక షాపింగ్ మాల్స్ వద్ద తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

 

IHG

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధించారు. రోడ్డు మార్గంలో కేరళ వెళ్లడాన్ని కూడా నిషేధించారు.
కేరళకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వ వెబ్ సైట్ covid 19 వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని, ఆ రిజిస్టర్ లో పూర్తి సమాచారం, వివరాలు సమర్పించిన తర్వాత మాత్రమే కేరళకు అనుమతించే నిబంధనలను రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: