ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తూ, విమర్శలు చేస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలోని లాయర్ పాత్రలో లీనమైపోయినట్టుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లా నేస్తం పథకం నిలిచిపోవడంపై ఘాటుగా విమర్శించారు. కరోనా వైరస్ ప్రభావం ఎంత తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ ఇటువంటి సమయంలో పాలకులు సహృదయంతో స్పందించి, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయకుండా, సక్రమంగా నిధులు విడుదల చేస్తూ అందరిని ఆదుకోవాలని, అలాగే కరోనా కష్ట సమయంలో లా నేస్తం పథకం ఎందుకు నిలిచిపోయింది అంటూ పవన్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు.

IHG

అసలు న్యాయవాదుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నిధి ఏమైందో కనీసం న్యాయవాదులకు కూడా అర్థం కావడం లేదని, న్యాయశాస్త్రం చదివిన అందరూ, స్థితిమంతులు కాదని, వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, చాలీ చలని సంపాదనతో బతుకుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు విరామం ప్రకటించిందని, పవన్ గుర్తు చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు ప్రతినెల 5000 ఇచ్చే విధంగా లా నేస్తం పథకం కొనసాగి ఉంటే, ఈ కరోనా  కష్ట సమయంలో వారికి ఆర్థిక భరోసా ఉండేదని, కానీ గత నాలుగు నెలలుగా ఈ సొమ్ము ఎందుకు అందించడం లేదని, పవన్ ప్రశ్నించారు.

 

IHG

 

ఈ విషయంపై న్యాయవాదులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో లా నేస్తం పథకం నిలిపివేయడం మంచిది కాదంటూ జగన్ కు సూచించారు. అలాగే న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్లు ఇస్తామని జీవో జారీ చేసినా ఇప్పటి వరకు ఆ నిధులు ఎందుకు విడుదల చేయలేదని పవన్ ప్రశ్నించారు. ఇప్పటికే లాయర్లు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తనకు వినతిపత్రం పంపించారు అని పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో జూనియర్, సీనియర్ అని తేడా లేకుండా, ప్రతి ఒక్కరికి నెలకి పదివేలు చొప్పున కనీసం ఆరు నెలల పాటు సహాయం అందించి, ప్రభుత్వం తన పెద్ద చాటుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: