ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం ఓ అంతర్భాగంగా మారిపోయింది. ఏ విమర్శల వచ్చినా అది కులాల ప్రస్తావనకు దారి తీస్తోంది. సీఎం జగన్ ను రెడ్డి ప్రతినిధిగా.. విపక్ష నేత చంద్రబాబు కమ్మ నేతగా.. మరోనేత పవన్ కల్యాణ్‌ కాపు నాయకుడిగా భావిస్తూ.. విమర్శలు చేయడం సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు విపక్షనేతలు సీఎం జగన్ కేవలం రెడ్డి వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఇటీవల విమర్శల జోరు పెంచారు. 

 

 


ఈ అంశంపై ప్రముఖ నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి స్పందించారు. వైఎస్ జగన్ కు కులాన్ని ఆపాదించడాన్ని ఆయన తప్పుపట్టారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబం మొదట నుంచి కులాలకు అతీతంగా సేవ చేసిందని పోసాని కృష్ణ మురళి అన్నారు. తాను పులివెందుల వెళ్లి పదిహేను రోజులు ఉన్నాననంటూ తన అనుభవాలను పోసాని కృష్ణ మురళి  పంచుకున్నారు. అక్కడ జగన్, ఆయన భార్య భారతి అక్కడ కులం, మతం వంటివి ఏమీ చూడకుండా స్కూళ్లు పెట్టారని, అలాగే దివ్యాంగులకు హాస్టళ్లు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారని పోసాని కృష్ణ మురళి వివరించారు. 

 

 


పులివెందుల నియోజకవర్గంలోఎక్కడా కులం గురించి ఆలోచనే లేదని పోసాని కృష్ణ మురళి  అన్నారు. ఇదే సమయంలో పోసాని కృష్ణ మురళి చంద్రబాబు పాలనలో కులతత్వం ఎలా రెచ్చిపోయిందో కూడా వివరించారు. చంద్రబాబు టైమ్ లో నంది అవార్డుల కమిటీ వేస్తే అందులో పదమూడు మందిని ఒకే కులం వారు ఎలా పెట్టారని పోసాని కృష్ణ మురళి  ప్రశ్నించారు. 

 

 


ఇక చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే పచ్చ మీడియాలో కులతత్వంతో తప్పుడు రాతలు రాస్తోందని పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎంతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారో.. జగన్ కూడా అంతకన్నా ఎక్కువగా నిలిచిపోతారని పోసాని అంటున్నారు. ఎవరూ కుత్సితమైన ఎల్లో మీడియాను నమ్మవద్దని... అబద్దాలు చెబతున్న ప్రతిపక్షాన్ని నమ్మవద్దని సూచిస్తున్నారు పోసాని కృష్ణ మురళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: