కరోనా వైరస్ ఇండియాలో రెచ్చిపోతోందా.. త్వరలోనే భారత్ కరోనా రాజధానిగా మారిపోనుందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. మొదట్లో కరోనా జాబితాలో ఎక్కడో కింద ఉన్న భారత దేశం ఇప్పుడు రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నా.. అది త్వరలోనే నెంబర్ వన్ స్థానానకి వెళ్తుందేమో అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

 


ఇండియాలో లాక్ డౌన్ నియంత్రణలు ఎత్తేయడంతో అడ్డూ అదుపూ లేకుండా వైరస్‌ విజృంభిస్తోంది. ఆదివారం దేశంలో 24 గంటల్లో 24,850 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదయిన అత్యధిక కేసుల రికార్డు ఇదే. తాజా కేసులతో కలిపితే దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువవుతోంది. ఇప్పటికే ఇండియా ప్రపంచ కరోనా కేసుల జాబితాలో అన్ని దేశాలనూ దాటి ముందుకు వెళ్తూ ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకుంది. 

 


ఇంకా భారత్ కంటే ముందు ఉన్నది అమెరికా.. ఈ దేశంలో దాదాపు 30 లక్షల వరకూ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్నది బ్రెజిల్.. ఈ దేశంలో 16 లక్షల వరకూ కేసులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు దేశాలకూ ఇండియా చాలా దూరంలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఇండియా కరోనా వ్యాపిస్తున్న తీరు.. ఇండియా జనాభా కారణంగా ఈ దేశాల రికార్డులను అధిగమించడానికి భారత్‌కు ఎక్కువ సమయం పట్టేలా కనిపించడం లేదు. 

 


ఎందుకంటే ఇండియాలో కరోనా అంత దారుణంగా వ్యాపిస్తోంది. రోజూ కనీసం 500 పైగా ప్రాణాలు కరోనాతో గాల్లో కలుస్తున్నాయి. గంటకు వెయ్యికి పైగానే కొత్త కేసులు వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. గంటకు 25 మంది వరకూ ప్రాణాలు విడుస్తున్నారు. 125 కోట్ల జనాభా ఉండటం వల్ల ఇండియాలో ఇంకా వైరస్ విస్తరణ చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడి ఇక తమవల్ల కాదనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: