చైనా ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుందా అనే అనుమానాలు ఇప్పటికే కొందరిలో మొదలయ్యాయట.. దీని తగ్గట్టుగానే అది ఎత్తులు వేస్తుందని తెలుస్తుంది.. ఒక వైపు కొత్త కొత్త వైరస్‌లను పుట్టించి ప్రపంచం మీదికి వదులుతుండటమే కాదు.. ఏ దేశం నియంత్రణ‌లో లేని దేశాల‌ను ఎన్నుకుని వారితో చర్చలు జరిపి, ఆశ చూపి తన గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది.. ఇదివరకే చైనా చేస్తున్న మోసాల గుట్టు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని చైనా గుఢాచారి వ్యవస్దలో పనిచేసిన వ్యక్తి ఒకగానొక సమయంలో బయటపెట్టాడు..

 

 

అదీగాక తాజాగా నేపాల్, పాకిస్దాన్, లొసుగులను తెలుసుకుని వారికి సపోర్ట్ ఇస్తూ, మన భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న విషయం కూడా తెలిసిందే.. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లను కూడా తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది.. ఇలా క్రమక్రమంగా తన బలాన్ని పెంచుకోవడానికి చైనా కుట్రలు చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇరాన్‌తో ఒక ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ వాసులు మాత్రం కొంత నిరాశ‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తుండగా, ఇరాన్ అతివాద ప‌త్రిక "జ‌వాన్" ప్ర‌చురించిన క‌థ‌నంలో "ల‌య‌న్‌-డ్రాగ‌న్ డీల్‌"గా ఈ ఒప్పందాన్ని అభివ‌ర్ణించింది..

 

 

ఇకపోతే ఈ ఒప్పందానికి సంబంధించిన వార్తను తొలిసారిగా 23, జ‌న‌వ‌రి 2016న ఇరాన్‌లో చైనా అధ్య‌క్షుడు షీ జిన్‌పింగ్ ప‌ర్య‌టించినప్పుడు ఈ రెండు దేశాలూ క‌లిసి ఓ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. కాగా ఒప్పందంలోని ఆర్టిక‌ల్‌-6 ప్ర‌కారం.. రెండు దేశాలు సాంకేతిక‌త‌, ప‌రిశ్ర‌మ‌లు, మౌలిక స‌దుపాయాలు, ఇంధ‌న రంగాల్లో స‌హ‌కారాన్ని పెంపొందించు కోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ త‌స్‌నీమ్ వెల్ల‌డించిందట. ఇక చ‌మురుకు సంబంధించి ఇరాన్‌, చైనా, ర‌ష్యాల మ‌ధ్య ఏ ఒప్పందం జ‌రిగినా.. అది ఇంధ‌నం, భ‌ద్ర‌త‌, ఆర్థిక రంగాల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని ఇరాన్‌‌కు చెందిన ఐఎల్ఎన్ఏ వార్తా సంస్థతో ఇరాన్ ఆర్థిక వేత్త అలీ అష్‌గ‌ర్ జర్గార్ చెప్పారు.

 

 

అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో చైనాకు ఇంధ‌న వ‌న‌రుల అవ‌స‌ర‌ముంది. ఇరాన్‌కు సాంకేతిక‌త‌, పెట్టుబ‌డులు అవ‌స‌రం ఉంది కాబట్టి ఈ ఒప్పందంతో రెండు దేశాల అవ‌స‌రాలూ తీరుతాయి.. అదీగాక చైనా ముందు అమెరికా కాస్త బ‌ల‌హీనంగా, అమెరికా ముందు చైనా కొంచెం అభ‌ద్ర‌తా భావంతో ఉన్న త‌రుణంలో చైనా-ఇరాన్‌ల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డానికి ఇదే మంచి స‌మ‌య‌మ‌ని భావించిందట.. అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంకు సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డంపై ఇరాన్ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయట..

 

 

ఈ నేపధ్యంలో దేశప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, కోరిక‌లు తెలుసుకోకుండా కుదుర్చుకున్న ఏ ఒప్పంద‌మైనా దేశానికి వ్య‌తిరేక‌మైన‌దే. అది చెల్ల‌దని పేర్కొన్నారు, ఇరాన్ మాజీ అధ్య‌క్షుడు మ‌హ‌మూద్ అహ్మ‌దినేజాద్. జూన్ 27న ఓ బహిరంగ స‌భ‌లో వ్యాఖ్యానించడమే కాకుండా ఇప్ప‌టికైనా దీని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారుట. కాగా చైనా మాత్రం తాజా ఒప్పందంతో ఇరాన్ తూర్పు దేశాల సంబంధాలే ల‌క్ష్యంగా త‌మ‌ వ్యూహాల‌కు మెల్ల‌గా ప‌దునుపెడుతోందని తెలుస్తుంది..

 

 

ఇక ఇప్పటికే ఈ కొత్త ఒప్పందంపై ఇరాన్ ప్ర‌జ‌ల్లో వ్యతిరేకత మొదలవుతుండగా, అక్కడి సోష‌ల్ మీడియాలో మాత్రం చైనా వ‌ల‌స‌వాదం మొద‌ల‌వుతుంద‌ని వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. ఏది ఏమైనా చైనా మాత్రం రహస్యంగా చేస్తున్న మోసాలు బట్టబయలు చేసి దాని దూకుడికి కళ్లెం వేసే రోజు ఎప్పుడు వస్తుందో అని చైనాకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: