ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా,  3586 మంది మరణించారు. ఈ కొత్త కేసుల్లో 60 శాతం అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. అమెరికాలో నిన్న 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. 
ఈ వైరస్‌ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ భారినపడినవారిలో 65,34,851 మంది కోలుకోగా, మరో 44,85,014 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.   అత్యధిక కరోనా కేసుల జాబితాలో నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్‌ వెనక్కి నెట్టివేసింది. దేశంలో ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 6.9 లక్షల కేసులు నమోదయ్యాయి.

 

దీంతో రష్యా నాలోగో స్థానానికి పడిపోయింది. భారత్‌లో ఇప్పటివరకు 6,97,836 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఈ మద్య కరోనాతో చనిపోయిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల మృతదేహాల ఖననం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.  తాజాగా కరోనాతో చనిపోయిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే అప్పగించాలని అమెజాన్‌ తెగకు చెందిన గిరిజనులు ఆరుగురిని కిడ్నాప్‌ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు.

 

కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని వివరించారు. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు తెలిపారు. కాగా, గిరిజన నేతకు కారోనా సోకి మృతిచెందాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు సదరు మృతదేహాన్ని ఖననం చేశారు. అందుకు గిరిజనులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. గిరిజనులు అందుకు అస్సలు ఒప్పుకోలేదు. తమ నేత పార్థివదేహం ​కోసం ఆరుగురు పౌరులను  కిడ్నాప్‌ చేశారు. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: