దేశంలో కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరిగిపోతున్నాయని ఎంత చెప్పినా కొంత మంది నిర్లక్ష్యం వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతుంది. మనం యుద్దం చేయనక్కరలేదే.. కేవలం మాస్క్, సామాజిక దూరం పాటిస్తే చాలు కరోనా దరి చేరదని ఎంత చెబుతున్నా కొంతమంది మాత్రం మాకేం కాదు అన్నట్టుగా వెళ్తున్నారు.  ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 2,12000 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆయా దేశాల గణాంకాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్‌ దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. అమెరికాలో 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు ఉండగా..బ్రెజిల్‌లో 24,431 కరోనా కేసులు వచ్చాయి.

 

తొలిసారి ఈ స్థాయిలో వైరస్ లక్షణాలు బయటపడటంతో మరింత ఆందోళన మొదలైంది. ఇక దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. గత వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసుల జాబితాలో రష్యాను వెనక్కి నెట్టిన భారత్‌ మూడో స్థానానికి చేరకున్నది. దేశంలో గత 24 గంటల్లో  425 మంది మరణించగా, కొత్తగా 24,248 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,97,413కు చేరింది.  దేశంలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతుండటంతో అత్యధిక కేసుల్లో భారత్‌ మూడోస్థానానికి చేరుకోగా, రోజువారీ మరణాల్లో కూడా మూడో ప్లేస్‌లోనే ఉన్నది.

 

మొత్తంగా మరణాల విషయంలో ఎనిమిదో స్థానంలో ఉన్నది. రష్యాలో ప్రస్తుతం 6,81,251 కరోనా కేసులు ఉన్నాయి. ముఖానికి మాస్కులు ధరించకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ కరోనా నివారణ చర్యలు చాలా కఠినంగా అమలు పరుస్తోంది ప్రభుత్వం. మాస్కులు ధరించనివారిపై రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. అలాగే రెండేళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: