ఇండియాలో జనాదరణ పొందిన యాప్స్ లో చాలా వరకూ చైనాకు చెందినవే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈ యాప్స్ కారణంగా భద్రతాసమస్యలు ఉన్నాయన్న కారణంతో చైనాకు చెందిన 59 యాప్స్ ను కేంద్రం నిషేధించింది. అదే సమయంలో ఇండియన్ కంపెనీలు సొంత యాప్స్ రూపొందించడంపై దృష్టి సారించాయి. ఇక లాక్ డౌన్ పుణ్యమా అని జూమ్ వంటి యాప్స్ బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. 

 

 


ఒకేసారి అనేక మందితో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించే సౌకర్యం ఈ జూమ్ యాప్ ద్వారా లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఇండియాలో దీన్ని విపరీతంగా వాడుతున్నారు. అయితే దీనిలోనూ భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని.. దీన్ని వాడటం శ్రేయస్కరం కాదని కేంద్రం ప్రకటించింది. దీంతో జూమ్ కు ప్రత్యామ్నాయం రూపొందించడంలో కంపెనీలు దృష్టి సారించాయి. 

 

IHG


ఇప్పుడు ఆ దిశగా ఓ పెద్ద ముందడుగు పడింది. జూమ్ తరహా యాప్ రూపకల్పన కోసం కేంద్రం ఎంపిక చేసిన స్టార్టప్ కంపెనీల్లో హైదరాబాద్ నగరానికి చెందిన రెండు స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తే.. మొత్తం 12 సంస్థల్ని ఎంపిక చేశారు. వాటిలో హైదరాబాద్‌కు చెందిన మూడు సంస్థలు కూడా ఉన్నాయి. ఫైనల్ ప్రోడక్ట్ తయారీకి మరో ఐదు సంస్థల్ని కేంద్రం ఎంపిక చేసింది.

 

 


వీటిలో హైదరాబాద్ కు చెందిన పీపుల్‌ లింక్‌ యూనిఫైడ్‌,  సౌల్‌పేజ్‌ ఐటీ సొల్యూషన్స్‌ స్థానం దక్కించుకున్నాయి. అంటే ఇక త్వరలోనూ ఇండియన్ జూమ్ యాప్ అందుబాటులోకి రాబోతోందన్నమాట. మొత్తానికి కేంద్రం చైనా యాప్ లను నిషేధించడం ద్వారా ఇండియన్ యాప్‌లకు మంచి భవిష్యత్ కనిపిస్తోంది. ఆ దిశగా అనేకమంది ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: