మహారాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరోవైపు ఉత్తరాదిలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నా... ఎండలు మాత్రం మండిపోతున్నాయి. 

 

మహారాష్ట్రతో పాటు ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, థానేలలో వంద మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. ముంబై నగరంలో 66 మిల్లీ మీటర్ల వర్షం పడగా, శాంతాక్రజ్‌ స్టేషన్‌ ప్రాంతంలో 111 మిల్లీ మీటర్ల వాన కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాల్లో గోడలు కూలిపోయాయి, చెట్లు నేలకొరిగాయి.  

 

భారీ వర్షాలతో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సెల్‌ అప్రమత్తమైంది. ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలు ప్రారంభించింది. గోడలు కూలడం, చెట్లు నేలకొరిగిపోవడం, కొమ్మలు విరిగిపడడం వంటి ఘటనల్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు అధికారులు. 

 

పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా రికార్డవుతున్నాయి. హర్యానాలోని హిస్సార్‌లో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ స్థాయి కంటే 2 డిగ్రీలు అధికం.  


అంబాలలో 35 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణ స్థాయి కంటే 4 డిగ్రీలు అధికం. యూపీ ఆగ్రాలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అలాగే, లక్నోలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా ఉంది. యూపిలోని గోరఖ్‌పూర్లో 34 మిల్లీ మీటర్ల వర్షం పడింది. జాన్సీలో 30, సోన్‌బద్రలో 19, సుల్తాన్‌పూర్తలో 3 మిల్లీ మీట్లర వాన కురిసింది. 

 

మొత్తానికి ఉత్తరాధిలో ఓవైపు వర్షాలు కురుస్తున్నా... మరోవైపు ఎండలు మండిపోతుండడంతో జనం ఇబ్బందిపడుతున్నారు. మొత్తానికి మహారాష్ట్రలో వింత వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు వర్షాలతో జనాలు అల్లాడూనే.. మరోవైపు ఎండలతో ఉక్కపోతకు గురవుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: