అదేంటి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే సీన్ ఉందా. అసలు అలాంటి ఎత్తులు ఆయన్ని చూసి ఎవరైనా వేయగలరా అంటే ఏమో ఇదంతా రాజకీయం. బాబు చూస్తే ఏర్లీ సెవెంటీ యియర్స్ నాటి పాలిటిక్స్ చేస్తారని అంటారు. ఇక బాబు ఇపుడు ఒడ్డున పడి ఉన్నారు. ఆయన మరో నాలుగేళ్ల వరకూ ఏమీ చేయలేరు. కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా ఇప్పించలేరు.

 

అటువంటి బాబుని అట్టిపెట్టుకుని ఉండాలా అని ఎవరికైనా అనిపించవచ్చు. పైగా పార్టీ ఓడి ఏడాది అయినా నాటి దూకుడు లేదు. నాయకులు ఎవరూ బయటకు రావడంలేదు. నిజానికి ఏపీలో టీడీపీని ఓడించాలని ఒక్క వైసీపీకే లేదు. వెనకాల బీజేపీకి కూడా బోలేడు కోరిక ఉంది. ఎందుకంటే బాబు  ఓడితేనే ఏపీలో పొలిటికల్ స్పేస్ వస్తుందని.

 

పైగా బీజేపీ ఓటు బ్యాంక్, వైసీపీ ఓటు బ్యాంక్ కూడా దాదాపుగా ఒక్కటే ఇక ఆధిపత్య సామాజిక వర్గాలు రెండు పార్టీలలో కూడా దాదాపుగా ఒక్కటే దాంతో ఇపుడు టీడీపీ మీద బీజేపీ గురి పెట్టిందని అంటున్నారు. బలమైన కమ్మ సామాజికవర్గం నాయకులకు బీజేపీ గేలం వేస్తోంది అంటున్నారు.

 

మరోవైపు టీడీపీలో ఉంటే సుఖం లేదని భావిస్తున్న వారు కూడా బీజేపీ బాటపడుతున్నారు. జగన్ తో పడని వారు, నేరుగా వైసీపీలోకి పోలేని వారు ఇపుడు బీజేపీ వైపే చూస్తున్నారు. అంటే ఈ పరిణామాలు చూసుకుంటే రానున్న రోజులో ఏపీలో బీజేపీ బలపడడానికి వేసే ఎత్తులన్నీ కూడా టీడీపీని మరింత బలహీనపరుస్తాయన్న మాట. అసలే జగన్ తో వేగలేకపోతున్న పసుపు పార్టీకి ఇపుడు కాషాయం నుంచి కూడా ముప్పు తోసుకువస్తే మాత్రం ఆ పార్టీని రక్షించడం కష్టమే అంటున్నారు.

 

మరి రాజకీయ చాణక్యుడుగా ఉన్న బాబు ఈ విషయంలో ఏం చేస్తారో ఎలా తన పార్టీని, తనను కూడా కాపాడుకుంటారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: