కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి అమాంతం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ ద్వారా విడుదల చేసింది. బులిటెన్ ప్రకారం నేడు ఒక్కరోజే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1843 కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా కేసులు 25,317 కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

 

 

ఒక మరోవైపు నేడు ఒక్క రోజే 680 మంది అత్యధికంగా కరోనా నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్రంలో  మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 10,527 కు చేరుకుంది. అయితే నేడు ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మృత్యువాత పడ్డారు. నేటితో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య నాలుగు వందలు దాటి 401 కి చేరుకుంది.

 

 

ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులలో 279 మందికి వారి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు వైద్యులు. ఇక నేడు ఒక్కరోజే బెంగళూరు మహానగరంలో ఏకంగా 981 పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగాయి. దీనితో కేవలం బెంగుళూరు లో పాజిటివ్ కేసుల సంఖ్య 10561 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: