ఆలస్యం అమృతం విషం... ఏ విషయమైనా కాస్త ఆలస్యమై తే అమృతం కూడా విషయమై పోతుంది. ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తు అలాగే ఉంది. విద్యార్థుల భవిష్యత్తు విషయం లో జరుగుతున్న అలసత్వం వారి భవిష్యత్తు పైన తీవ్ర ప్రభావం చూపుతుంది, ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయం లో విద్యాసంస్థ లు అన్ని మూత పడిన విషయం తెలిసిందే. ఇక కొంతమంది విద్యార్థుల కు ఆన్లైన్ క్లాసుల ద్వారా  పాఠాలు  బోధిస్తున్నారు. ఇదిలా ఉంటే..  సరిగ్గా  విద్యార్థుల కు  పరీక్షలు జరగాల్సి ఉన్న  సమయం లోనే కరోనా  వైరస్ తెరమీద కి వచ్చింది. 

 

 ఈ నేపథ్యం లో కరోనా వైరస్ రోజురోజుకు పెరిగి పోతున్న దృశ్య 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసి అందరిని పాస్ చేశారు. తెలంగాణ లో పది పరీక్షలు రద్దు చేసినప్పటికీ ఇంటర్ పరీక్షల విషయం లో మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేదు తెలంగాణా సర్కార్. అయితే చేసుకుంటే ప్రస్తుతం విద్యార్థులందరి కీ పరీక్షలు రద్దు చేసి పాస్ కావడం వల్ల కొంత మందికి మేలు జరిగింది అని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వాలు పాస్ అయితే చేసాయి కానీ సర్టిఫికెట్ మాత్రం  ఇప్పటివరకు జారీ చేయలేదు. 

 

 దీంతో ఈ ఆలస్యం కాస్త విద్యార్థుల భవిష్యత్ లో ఎంతగా నో ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈ విషయాన్ని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో అలసత్వం వహించడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. అంతే కాకుండా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేయడంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పీజీ పరీక్షలు కూడా రద్దు చేయడమే మంచిది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయంలో అలసత్వం తగదని ముఖ్యమంత్రులు ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: