జగన్ ఇపుడు అనుభవిస్తున్న సీఎం పదవి కోసం పదేళ్ల పాటు కష్టపడ్డారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు. ఎన్నో అగచాట్లు పడ్డారు. పదహారు నెలలు జైలు జీవితం అనుభవించారు. జగన్ ఒక మాట అంటూండేవారు తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా ముప్పయ్యేళ్ల పాటు సీఎంగా ఉంటానని, ఆ దిశగానే జగన్ పాలన తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే జగన్ పదవి అల్పాయుష్షు అని టీడీపీ ప్రచారం చేస్తోంది.

 

అయితే ఇది మైండ్ గేమా  లేక దీని వెనక ఏమైనా ఒక  రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. జమిలి ఎన్నికలు బీజేపీకి ముచ్చట అని అందరికీ తెలిసిందే. ఇప్పటిదాకా చూసుకుంటే దేశంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓడి ఆరేళ్ళు అయినా ఇంకా పుంజుకోలేదు. పైగా రాహుల్ రాజకీయం బేలతనంతో, బాలారిష్టాలతో సాగుతోంది. సోనియాగాంధీ అనారోగ్యం కూడా కాంగ్రెస్ ని బాగా క్రుంగదీస్తోంది.

 

ఇంకో వైపు చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు కూడా  మెల్లగా చప్పబడిపోతున్నాయి. ఒకనాడు ఉత్తరాదిన బలంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ వయో వ్రుధ్ధుడు అయిపోయారు. ఇక prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక మహారాష్ట్రలో శరాద్ పవార్ కూడా ఎనభయ్యేళ్ళ వ్రుధ్ధ నేతగా ఉన్నారు. వామపక్షాలు బాగా బలహీన పడ్డాయి.

 

మమతా బెనర్జీని వచ్చె ఏడాది జరిగే ఎన్నికలో ఓడిస్తే బీజేపీకి ఉత్తరాదిన గట్టి పోటీ ఇచ్చే నాయకులు ఉండరు. ఈ నేపధ్యంలో అన్నీ సర్దుకుని 2022 నాటికి దేశమంతా జమిలి ఎన్నికలు పెట్టుకుంటే మరో అయిదేళ్ల పాటు తిరుగులేని అధికారం సొంతం అవుతుందని బీజేపీ ఢిల్లీ సర్కిళ్లలో నానుతున్న మాట. మరి ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తే కనుక ఏపీలో జగన్ కే ఎక్కువ నష్టం జరుగుతుంది అంటున్నారు. కేసీయార్ కి అప్పటికి  కనీసం మూడున్నర ఏళ్ల పదవీ కాలం పూర్తి అవుతుంది. జగన్ బొత్తిగా మూడేళ్ళకే అధికారం కోల్పోవాల్సివుటుంది.

 

ఇక జమిలి ఎన్నికలతో మోడీ దూసుకువస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద కూడా పడి ఏపీలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. పైగా బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా దూసుకువస్తే జగన్ కి గట్టి సవాలేనని చెబుతున్నారు. అందుకే మాజీ ఎంపీ సబ్బం హరి లాంటి వారు జమిలి ఎన్నికల నినాదాన్ని తరచూ వినిపిస్తున్నారు అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: